Good Qualities In Topper Children : పిల్లల భవిష్యత్తు బంగారంలా ఉండాలని తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తుంటారు. స్థాయికి మించి ఫీజులు చెల్లిస్తుంటారు. కానీ.. చాలా మంది పిల్లలు సరిగా చదవరు. కొంత మంది మాత్రమే ఎప్పుడూ టాప్ లో ఉంటారు. మరి.. ఎక్కువ మార్కులు సాధించే పిల్లల్లో ఉండే లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
థింకింగ్ :
ఎక్కువ మార్కులు సాధించే పిల్లలు పాఠాలను తమదైన కోణంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. బట్టీ పట్టకుండా.. అది ఎందుకు అలా జరిగింది? అలా జరగడం వెనుక ఉన్న కారణం ఏంటి? అనే సందేహాలనుటీచర్లను అడిగి తెలుసుకుంటారు. ఇలా.. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించడం వల్ల వారు నేర్చుకున్న విషయాలను మార్చిపోకుండా గుర్తుంచుకుని విజయం సాధిస్తారని నిపుణులు చెబుతున్నారు.
కమ్యూనికేషన్ స్కిల్స్ :
చదువులో అందరికంటే ముందుండే పిల్లల్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. దీనివల్ల వారు స్నేహితులు, టీచర్లతో మంచి సంబంధాలను కొనసాగిస్తారు. అలాగే కమ్యూనికేషన్‌స్కిల్స్ ఎక్కువగా ఉండే పిల్లల్లో ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల వారు తమపైన నమ్మకాన్ని ఉంచుకుని పరీక్షలకు బాగా సన్నద్ధమవుతారట.
టైమ్ మేనేజ్‌మెంట్ :
ఎక్కువ మార్కులు సాధించే పిల్లలు డైలీ లైఫ్‌లో టైమ్ మేనేజ్‌మెంట్ పక్కాగా ఫాలో అవుతారు. వారు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత హోమ్ వర్క్ పూర్తి చేసుకుని, టీచర్లు చెప్పిన పాఠాలను ఒకసారి చదువుతారు. ఆ తర్వాత సరైన టైమ్‌కు నిద్రపోతారు. మళ్లీ ఉదయాన్నే నిద్రలేచి స్కూల్‌కు సరైన సమయానికి వెళ్తారు.
మీ పిల్లలకు ఇవి చెబుతున్నారా? లేదా?
క్రమ శిక్షణ :
పిల్లలు జీవితంలో సక్సెస్ అవ్వాలంటే చిన్నప్పటి నుంచి వారికి క్రమ శిక్షణ ఉండటం చాలా ముఖ్యం. అయితే, సాధారణ పిల్లలతో పోల్చితే టాపర్‌లుగా ఉండే పిల్లల్లో క్రమశిక్షణ ఎక్కువగా ఉంటుందట.