Smart Ways To Handle Salary Negotiations :ఏ చిన్న జాబ్కైనా సరే ముందుగా అభ్యర్థుల స్కిల్స్ టెస్ట్ చేసి, ఆ తర్వాత సాలరీ మేటర్ డిస్కస్ చేస్తారు. అయితే.. ఇక్కడ ఎంత వేతనం ఇస్తారో కంపెనీ ప్రతినిధులు చెప్పరు. ఎంత కావాలో చెప్పమని అభ్యర్థినే అడుగుతారు. చాలా మందికి ఈ ప్రశ్న ఒక సవాల్. ఎందుకంటే.. ఒకవేళ ఎక్కువ జీతం అడిగితే కంపెనీలు వేరే వ్యక్తులను పరిశీలించే ఛాన్స్ ఉంటుంది. అదే.. తక్కువ శాలరీ అడిగితే, మన సామర్థ్యాల్ని మనమే తక్కువ చేసుకున్నట్టు అవుతుంది. ఆ తర్వాత బాధపడాల్సి వస్తుంది. అందుకే.. సరైన ఆన్సర్ చెప్పడం చాలా ముఖ్యం. మరి.. ఇందుకోసం ఎలాంటి టిప్స్ పాటించాలో ఇప్పుడు చూద్దాం.
సెర్చ్ చేయండి :ఇంటర్వ్యూకి వెళ్లే ముందు మీ స్కిల్స్ విషయంలో ఎలా ప్రిపేర్ అవుతారో.. శాలరీ ఎంత అడగాలి? అనే విషయంలోనూ అలాగే ప్రిపేర్ కావాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం.. మీరు చేయాల్సిన మొదటిపని ఇంటర్నెట్ సెర్చ్. ఆన్లైన్లో ఎన్నో రకాల జాబ్ పోర్టల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో.. మీ జాబ్ ప్రొఫైల్లో ఉన్నవారికి ఎంత శాలరీ వస్తోందనే విషయాన్ని సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. మీ అనుభవం, విద్యార్హతలు, నైపుణ్యాలు వంటి అంశాల ఆధారంగా.. సోషల్ మీడియాతో పాటు వివిధ జాబ్ ఆఫరింగ్ సైట్లు రీసెర్చ్ చేయడం ద్వారా మీ జీతంపై ఒక అవగాహన వస్తుందంటున్నారు నిపుణులు.
వారితో కనెక్ట్ అవ్వాలి : మీరు చేరాలనుకుంటున్న కంపెనీలో ఇప్పటికే పనిచేస్తున్న వారితో కచ్చితంగా కనెక్ట్ అవ్వాలి. ఆ కంపెనీలో మీ ప్రొఫైల్ ఉన్నవారికి జీతాలు ఏవిధంగా ఇస్తున్నారో అడిగి తెలుసుకోవాలి. ప్రస్తుత పరిస్థితిలో ఎంత మొత్తం శాలరీ కోట్ చేయొచ్చనేది ముందే అడిగి తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వేరే సంస్థల్లో పనిచేస్తున్న వారు ఎవరైనా తెలిస్తే.. వారిని కూడా సంప్రదించాలని చెబుతున్నారు.
ముందే నిర్ణయించుకోండి : పైన చెప్పిన వివరాల ఆధారంగా ఒక నిర్ణయానికి వచ్చేసి.. జీతం ఎంత అడగాలి అనేది ముందే డిసైడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇంటర్వ్యూ చేసే వారు అడగ్గానే తడుముకోకుండా చెప్పేసేలా ఉండాలి. మీ కాన్ఫిడెన్స్ చూస్తే.. అడిగినంత ఇవ్వొచ్చు అనేలా ఉండాలి తప్ప.. మాట తడబడొద్దని సూచిస్తున్నారు. ఒకవేళ సరైన ఫిగర్ చెప్పలేకపోతే "ఇంత రేంజ్లో శాలరీ ఆశిస్తున్నాను" అని చెప్పాలి. అలా చెప్పడం వల్ల రిక్రూటర్‌కి ఒక ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుంది. ఫలితంగా రేంజ్‌లోనే శాలరీ పొందే వీలు కలుగుతుందంటున్నారు నిపుణులు.