AFCAT- 02/2024 :ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AFCAT -02/2024) నోటిఫికేషన్ విడుదల అయ్యింది. కోర్స్ 2025 జులై నుంచి ప్రారంభం అవుతుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ జూన్ 28 తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు
ఏఎఫ్ క్యాట్- 02/ 2024, NCC స్పెషల్ ఎంట్రీ
1. ఏఎఫ్‌క్యాట్ ఎంట్రీ :
- ఫ్లయింగ్/ గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్)
- గ్రౌండ్ డ్యూటీ (నాన్- టెక్నికల్)
2. ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ : ఫ్లయింగ్
విద్యార్హతలు
AFCAT Eligibility :
- ఇంటర్ (మ్యాథ్స్, ఫిజిక్స్), బ్యాచిలర్ డిగ్రీ, బీఈ, బీటెక్ ఉత్తీర్ణత.
- అభ్యర్థులకు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కచ్చితంగా ఉండాలి.
వయోపరిమితి
AFCAT Age Limit
- ఫ్లయింగ్ బ్రాంచ్ అభ్యర్థుల వయస్సు 20 ఏళ్ల నుంచి 24 ఏళ్లు మధ్యలో ఉండాలి.
- గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్/ నాన్-టెక్నికల్) బ్రాంచ్ అభ్యర్థుల వయస్సు 20 ఏళ్ల నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్
AFCAT Pay Scale :ఫ్లయింగ్ ఆఫీసర్లకు నెలకు రూ.56,100 - రూ.1,77,500 వరకు జీతభత్యాలు అందిస్తారు.
ఎంపిక విధానం
AFCAT Selection Process :పోస్టులను అనుసరించి ఆన్‌లైన్ పరీక్ష, స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ, కంప్యూటరైజ్డ్ పైలట్ సెలక్షన్ సిస్టం పరీక్ష పెడతారు. వైద్యపరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన చేసి, అర్హులైన అభ్యర్థులను శిక్షణ కోసం ఎంపికచేస్తారు.
ముఖ్యమైన తేదీలు
AFCAT Important Dates :
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం : 2024 మే 30
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2024 జూ న్ 28
- ఆన్‌లైన్ పరీక్ష తేదీ : 2024 ఆగస్టు 9, 10, 11
***
BSFలో 144 ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులు
BSF Recruitment 2024 : బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) పారా మెడికల్ స్టాఫ్ గ్రూప్-బి, గ్రూప్-సి (నాన్-గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగాల వివరాలు
- బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ - 2 పోస్టులు
- ఎస్ఐ స్టాఫ్ నర్స్ - 14 పోస్టులు
- ఏఎస్ఐ ల్యాబ్ టెక్నీషియన్ - 38 పోస్టులు
- ఏఎస్ఐ ఫిజియోథెరపిస్ట్ - 47 పోస్టులు
- ఎస్ఐ వెహికల్ మెకానిక్ - 3 పోస్టులు
- కానిస్టేబుల్ టెక్నికల్ - 34 పోస్టులు
- హెడ్ కానిస్టేబుల్ వెటర్నరీ - 4 పోస్టులు
- కానిస్టేబుల్ కెన్నెల్మాన్ - 2 పోస్టులు
- మొత్తం పోస్టుల సంఖ్య: 144
ముఖ్యమైన తేదీలు
- ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 2024 మే 19
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :2024 జూన్ 17
ఐటీఐ అర్హతతో - రైల్వేలో 1010 పోస్టులు - అప్లై చేసుకోండిలా! - Railway Apprentice Posts 2024
గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? ఈ 10 టిప్స్ పాటిస్తే ఉద్యోగం గ్యారెంటీ! - Competitive Exam Preparation Tips