Zomato Request to The Customers: ప్రస్తుతం ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్స్ పెట్టుకునే వారి సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోంది. వంట చేసుకోవడానికి టైమ్ లేక కొందరు.. నచ్చిన ఆహార పదార్థాలను తిన్నాలన్నా కోరికతో మరికొందరు.. ఇలా పలు కారణాలతో చాలా మంది నిమిషాల్లో ఆర్డర్ ప్లేస్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే డెలివరీ బాయ్స్ కూడా ఫుడ్‌ను డెలివరీ చేస్తున్నారు. నగరాల్లో ఈ యాప్‌లకు ఫుల్ డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే ఫుడ్ డెలివరీ బాయ్స్ పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా జొమాటో తమ కస్టమర్లను రిక్వెస్ట్ చేస్తూ ఓ ట్వీట్ చేసింది. అయితే ప్రస్తుతం ఆ ట్వీట్‌పై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఇంతకీ ఏమని ట్వీట్ చేసిందో ఈ స్టోరీలో చూద్దాం..
దేశవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. పెరిగిన ఉష్ణోగ్రతలు, ఉక్కపోత వంటి కారణంగా చాలా మంది అల్లాడుతున్నారు. అయితే దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నా.. మరికొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్పామ్ జొమాటో తమ డెలివరీ బాయ్స్ పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఓ ట్వీట్ చేసింది.
"తప్పనిసరిగా అవసరమైతే తప్పా మధ్యాహ్న సమయాల్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవద్దు.. ప్లీజ్" అని రిక్వెస్ట్ చేస్తూ ఎక్స్(ట్విట్టర్) వేదికగా జొమాటో ట్వీట్ చేసింది. మధ్యాహ్నం టైమ్‌లో ఎండవేడి ఎక్కువగా ఉంటోంది. దీనివల్ల ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు బైక్‌పై తిరగడం కష్టం అవుతోంది. ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు ఎండవేడిని తట్టుకోలేకపోతున్నారు. ఈ కారణంగానే జొమాటో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.