Kalyan Jewellers MD Success Story :మనదేశంలో బంగారం వ్యాపారం అంతకంతకూ విస్తరిస్తుండగా, కొంతమంది వ్యాపారవేత్తలు తమకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించారు. అలా భారత్‌లో అగ్రగామి బంగారు విక్రయ సంస్థల్లో కల్యాణ్ జ్యువెలర్స్ ఒకటి. వాస్తవానికి కల్యాణ్ జ్యువెలర్స్ పేరు వినని పసిడి ప్రియులు ఉండరంటే అతిశయోక్తి కాదు. మరి అంతటి పేరు ప్రఖ్యాతులు పొందిన ఆ సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఆయనే టీఎస్ కల్యాణ రామన్. మరి కల్యాణ్ రామన్ విజయ ప్రస్థానాన్ని ఓసారి తెలుసుకుందాం.
కేరళలోని త్రిసూర్‌కు చెందిన కల్యాణ్ రామన్- 12 ఏళ్ల వయసులోనే బంగారం వ్యాపారంలోకి ప్రవేశించారు. తన తండ్రి వ్యాపారంలో సహాయం చేసేవారు. ఆ తర్వాత శ్రీ కేరళ వర్మ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం బంగారం దుకాణాన్ని తెరవాలని నిర్ణయించుకున్నారు. తాను అప్పటికే పొదుపు చేసుకున్న రూ.25లక్షలతో వ్యాపారాన్ని ప్రారంభిద్దామనుకున్నారు. అవి సరిపడక లోన్ రూపంలో రూ.50 లక్షల అప్పు తీసుకున్నారు.