తెలంగాణ

telangana

ETV Bharat / business

'పది రూపాయల నాణెం చెల్లుతుంది - కాదంటే శిక్ష తప్పదు' - ఆర్​బీఐ - Awareness On Ten Rupees Coin

Awareness Ten Rupees Coin : ప్రజల్లో పది రూపాయల నాణెం చెల్లదన్న అపోహ బలంగా ప్రబలింది. ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఆర్​బీఐ గత కొన్ని సంవత్సరాలుగా విశ్వప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో పది రూపాయల నాణేం వినియోగంపై బ్యాంకర్లు, రిటెయిలర్లతో ఆర్‌బీఐ సమావేశం కానుంది.

Ten Rupees Coin
Ten Rupees Coin (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Aug 7, 2024, 9:09 AM IST

RBI Create Awareness On Ten Rupees Coin : సాధారణంగా రిజర్వ్​ బ్యాంక్ జారీచేసే డబ్బులకు మార్కెట్​లో ఎలాంటి అడ్డంకులు ఉండవు. కానీ, పది రూపాయల నాణెం విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. పది రూపాయల నాణెం చెల్లదనే అపోహ ప్రజల్లో చాలా బలంగా ఉంది. వాస్తవానికి ఇది ఎలా మొదలైందో తెలియదుగానీ, పది రూపాయల నాణెం చెల్లదనే వాదన జనాల్లో బలంగా నాటుకుపోయింది.

పది రూపాయల కాయిన్​పై ఉన్న వదంతులను తిప్పికొట్టేందుకు భారతీయ రిజర్వ్​ బ్యాంకు కొన్నేళ్లుగా విశ్వప్రయత్నాలు చేస్తుంది. ఎలాంటి ఆకృతిలో ఉన్న పది రూపాయల నాణెమైనా చెల్లుతుందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. అందువల్ల పది రూపాయల కాయిన్​ను నిరాకరించవద్దని స్పష్టమైన ఆదేశాలు సైతం జారీ చేసింది. ఈ కాయిన్​లను నిరాకరిస్తే చట్టప్రకారం, శిక్షార్హులని కూడా ఇప్పటికే పలుమార్లు హెచ్చరించింది.

పాతుకుపోయిన అపోహలు
మాములుగా కూరగాయల వ్యాపారులు, చిన్నచిన్న హోటళ్లు, కిరాణా, బడ్డీ కొట్ల వర్తకులు చిల్లర నాణేల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే, అక్కడ కూడా పది రూపాయల నాణెం ఇస్తే మాత్రం తీసుకోమని చెప్పేస్తున్నారు. బాగా నలిగిపోయిన పది రూపాయల నోటు అయినా తీసుకుంటున్నారే తప్పా, పది నాణేలను మాత్రం తీసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు.

రంగంలోకి దిగిన ఆర్‌బీఐ
ఇక పెద్దపెద్ద మాల్స్‌ సిబ్బందిలోనూ పది రూపాయల కాయిన్​ మీద అపోహ ఉంది. దీని వల్ల ఎక్కడికక్కడ వివిధ బ్యాంకుల చెస్ట్‌ల్లో ఈ నాణేలు లక్షల్లో పేరుకుపోతున్నాయి. విజయవాడలోని ఓ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు చెస్ట్‌లోనే దాదాపు రూ.12 లక్షల విలువ చేసే పది రూపాయల నాణేలు పేరుకుపోయినట్టు సమాచారం. ఆ డబ్బులను పెట్టేందుకు చోటులేక సిబ్బంది ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పది రూపాయల నాణేలను నిరాకరించడంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆర్‌బీఐ బుధవారం ప్రధాన బ్యాంకర్లు, వారి కస్టమర్లుగా ఉన్న ముఖ్యమైన రిటెయిల్‌ సంస్థల ప్రతినిధులతో విస్తృత సమావేశం నిర్వహిచేందుకు సిద్ధమైంది.

పలు డిజైన్లలో పది నాణేలు : 2009 మార్చి నుంచి 2017 జూన్‌ మధ్య కాలంలో 14 సార్లు పది రూపాయల నాణేలు విడుదలయ్యాయి. ఆయా సందర్భాల్ని బట్టి కాయిన్లను వివిధ డిజైన్‌లో విడుదల చేశారు. మాములుగా అయితే, రూ.10 నోట్ల మార్పిడి ఎక్కువగా జరుగుతుంది. నోట్లు చేతులు మారే కొద్దీ త్వరగా పాడవుతుంటాయి. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు ఆర్‌బీఐ, మిగతా నాణేలతోపాటు కొన్నేళ్లుగా రూ.10 నాణేలనూ ముద్రిస్తూ వస్తోంది.

యుద్ధానికి సిద్ధమవుతున్న ఇరాన్, ఇజ్రాయెల్​ - అగ్నికి ఆజ్యం పోస్తున్న రష్యా! - Israel Iran War Preparations

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథిగా మహమ్మద్ యూనస్​ - Yunus as head of Bangladesh govt

ABOUT THE AUTHOR

...view details