తెలంగాణ

telangana

ETV Bharat / business

పెట్రోల్ బంకు వాళ్లు చీట్​ చేస్తున్నారా? సింపుల్ టిప్స్​తో చెక్​ పెట్టిండిలా! - Petrol Pump Scams

How To Avoid Petrol Pump Fraud : డిజిటిల్ యుగంలో ఆన్​లైన్​లోనే కాదు, పెట్రోలు బంకుల్లో కూడా మోసం చేసి, వినియోగదారుల డబ్బులు కొట్టేస్తున్నారు. ఇంతకూ పెట్రోల్​ బంకుల్లో ఎలాంటి మోసాలు జరుగుతాయి? వాటిని ఏ విధంగా గుర్తించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

How To Avoid Petrol Pump Fraud
How To Avoid Petrol Pump Fraud (ANI)

By ETV Bharat Telugu Team

Published : Aug 22, 2024, 8:46 PM IST

How To Avoid Petrol Pump Fraud : ప్రస్తుతం ఆన్​లైన్​లో కాదు, పెట్రోలు బంకుల్లో కూడా చాలా మోసాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. తక్కువ పెట్రోల్ కొట్టి ఎక్కువ డబ్బులు తీసుకోవడం, కల్తీ పెట్రోల్ విక్రయించడం వంటి వాటితో వినియోగదారుల నుంచి డబ్బులు దొచేస్తున్నారు! వాటిని ఎలా గుర్తించాలో చూద్దాం.

జీరోని చెక్ చేయండి
పెట్రోల్​ బంక్ వాళ్లు చేసే మోసాల్లో షార్ట్ ఫ్యూయలింగ్ ప్రధానమైనది​. దీనిని సింపుల్​గా చెప్పాలంటే, తక్కువ ఇంధనం నింపి, ఎక్కువ డబ్బులు వసూలు చేస్తుంటారు. అందుకే ఆయిల్ ఇంధనం నింపడం ప్రారంభించే ముందు ఆ మీటర్ సున్నాకు సెట్ చేసి ఉందా లేదని చూసుకోవడం ముఖ్యం. ఫ్యూయల్ డిస్పెన్సర్ సున్నా వద్ద సెట్ చేసి లేకపోతే దానిని రీసెట్ చేయమని సిబ్బందిని అడగొచ్చు.

ఇంధన సాంద్రత
పెట్రోల్​ బంకు వాళ్లు ఫ్యూయెల్ డెన్సిటీ (ఇంధన సాంద్రత)లో కూడా మార్పులు చేస్తుంటారు. ఈ మోసాన్ని నివారించాలంటే, మీటర్​లో ఇంధన సాంద్రతను చెక్ చేయాలి. కొన్నిసార్లు మీటర్​ను కూడా వాళ్లు మానిప్యులేట్ చేస్తుంటారు. అందుకే ఇంధనం నింపేటప్పుడు దాని ధరను కూడా పరిశీలించాలి. పెట్రోల్ ఫ్లో చాలా వేగంగా ఉంటే, దాని డెన్సిటీలో మార్పులు చేసి మిమ్మల్ని మోసం చేస్తున్నారని గుర్తించాలి.

ట్యాంకులో తక్కువ పెట్రోల్
బంకు సిబ్బంది ప్రవర్తనను కూడా గమనిస్తూ ఉండాలి. మమ్మల్ని మోసం చేశారని అనిపిస్తే వెంటనే ట్యాంకులో పెట్రోల్​ను చెక్​ చేసుకోండి. ఏమైనా మోసం చేశారని తెలిస్తే వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయండి.

స్కామ్​లపై అవగాహన
సాధారణంగా పెట్రోల్​ బంకుల్లో ఎలాంటి స్కామ్​లు జరుగుతుంటాయో తెలుకోవాలి. వాటి నుంచి ఎలా బయట పడాలో కూడా అవగాహన పెంపొందించుకోవాలి. ఇలా చేయడం వల్ల బంకుల్లో చేసే స్కామ్​లను సులభంగా నివారించవచ్చు.

మోసాన్ని గుర్తిస్తే కంప్లైట్ చేయండి
పెట్రోలు బంకుల్లో మోసం జరిగినట్లు మీరు గుర్తిస్తే, అక్కడే కంప్లైంట్​ బుక్ అడిగి, అందులో మీ ఫిర్యాదును రిజిస్టర్ చేయాలి. ప్రతి ఆయిల్ కంపెనీ, ప్రతి పెట్రోల్ బంక్​లోనూ ఒక కంప్లైంట్​ రిజిస్టర్ బుక్​ను అందుబాటులో ఉంచుతుంది. ఒకవేళ అలా కుదరకపోతే, ఆయిల్ కంపెనీ వెబ్​సైట్​లోనూ సదరు పెట్రోల్ బంక్​పై ఫిర్యాదు చేయవచ్చు. సాక్ష్యంగా ఏదోక ఫొటోను కూడా ఇవ్వండి.

పెద్ద బంకులను ఎంచుకోవడం ఉత్తమం
చిన్న చిన్న బంకుల్లో ఇంధనం నింపడం కంటే మంచి పేరున్న ఇంధన స్టేషన్లో ఆయిల్ నింపుకోవడం ఉత్తమం. ఎప్పుడూ అలా చేయడం సురక్షితమైన ఆలోచన కూడా. మీకు తెలిసిన, నమ్మకం ఉన్న ఇంధన స్టేషన్లను మాత్రమే ఎంపిక చేసుకోండి.

పెట్రోల్ కార్ Vs సీఎన్‌జీ కార్​- ఈ రెండింట్లో ఏది బెటర్? - CNG vs Petrol Cars

ABOUT THE AUTHOR

...view details