Google Pay Launches UPI Circle : గూగుల్‌కు చెందిన చెల్లింపు సేవల సంస్థ గూగుల్ పే (Google pay) 'యూపీఐ సర్కిల్' ఫీచర్‌ను లాంఛ్ చేసింది. దీని ద్వారా ఒక యూజర్ తన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, తన సొంత యూపీఐ అకౌంట్‌ను వాడుకునే సదుపాయాన్ని కల్పించవచ్చు. అవతలి వ్యక్తులకు బ్యాంకు ఖాతా లేకపోయినా దీన్ని వాడుకోవచ్చు. ముంబయి వేదికగా జరుగుతున్న గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్, 2024లో భాగంగా యూపీఐ సర్కిల్‌తో పాటు మరికొన్ని ఫీచర్లను గూగుల్ పే తీసుకొచ్చింది.
యూపీఐ సర్కిల్ సేవలు అందించడం కోసం గూగుల్ పే 'ఎన్‌పీసీఐ'తో జట్టు కట్టింది. అలాగే ఇదే వేదికపై ఈ-రూపీ సేవలను కూడా 'జీపే' ఆవిష్కరించింది. రూపే కార్డులు కలిగి ఉన్న వారికి 'ట్యాప్ అండ్ పే పేమెంట్స్' ఫెసిలిటీ కూడా ప్రకటించింది. అలాగే యూపీఐ లైట్‌లో 'ఆటోపే ఆప్షన్'ను కూడా తీసుకొచ్చింది.
యూపీఐ సర్కిల్ అంటే ఏమిటి?
యూపీఐ సర్కిల్ అనేది ఒక డెలిగేటెడ్ పేమెంట్ ఫీచర్. దీని ద్వారా ఒక ప్రైమరీ యూపీఐ యూజర్, తనకు అత్యంత నమ్మకమైన వ్యక్తులకు (సెకెండరీ యూజర్లకు) పేమెంట్స్ చేసే బాధ్యతను అప్పగించడానికి వీలవుతుంది. అంతేకాదు ప్రైమరీ యూజర్, సెకెండరీ యూజర్లకు ఫుల్ యాక్సెస్ ఇవ్వవచ్చు. లేదా పాక్షికంగా పేమెంట్స్ చేసే అవకాశం మాత్రమే ఇవ్వవచ్చు. అంతేకాదు వారు చేసే ఆర్థిక లావాదేవీలను కూడా ప్రైమరీ యూజర్ కంట్రోల్ చేయవచ్చు. ఈ విధానం వల్ల మరింత ఎక్కువగా, సురక్షితంగా యూపీఐ పేమెంట్స్ చేయడానికి వీలవుతుందని ఎన్‌పీసీఐ చెబుతోంది.
యూపీఐ సర్కిల్ ఎలా పనిచేస్తుంది?
యూపీఐ సర్కిల్లో 2 రకాల యూజర్లు ఉంటారు. వారు:
1. ప్రైమరీ యూజర్