తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎలక్ట్రిక్ కారు వాడుతున్నారా? ఈ టాప్​-5 మెయింటెనెన్స్ టిప్స్ మీ కోసమే! - Car Maintenance Tips

Electric Car Maintenance Tips : మీరు కొత్తగా ఎలక్ట్రిక్ కారు కొన్నారా? దానిని ఎలా మెయింటైన్ చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారా? అయితే ఇది మీ కోసమే. ఈవీ కార్లను మంచిగా మెయింటైన్ చేయడానికి ఉపయోగపడే టాప్-5 టిప్స్​ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ev Car Maintenance Tips
Electric Car Maintenance Tips

By ETV Bharat Telugu Team

Published : Mar 4, 2024, 3:40 PM IST

Electric Car Maintenance Tips :ప్రస్తుతకాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు బాగా ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా ఇంధన ధరలు బాగా పెరుగుతున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. అయితే వీటి సంఖ్యకు అనుగుణంగా ఈవీ సర్వీసింగ్ సెంటర్లు అందుబాటులోకి రావటం లేదు. పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోల్చితే ఎలక్ట్రిక్ కార్ల మెయింటెనెన్స్ఖర్చు తక్కువే. అయినప్పటికీ సక్రమంగా మెయింటెన్ చేయకపోతే ఎలక్ట్రిక్​ కారు పాడైపోయే ప్రమాదముంది. అయితే కొన్ని చిట్కాలు పాటించటం ద్వారా మన ఈవీ కార్ల లైఫ్​స్పాన్​ను పెంచుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  1. బ్యాటరీ కండిషన్​ :ఎలక్ట్రిక్ కార్లు బ్యాటరీలతో నడుస్తాయి. సాధారణంగా ఇవి లిథియం-అయాన్​ బ్యాటరీలు అయ్యుంటాయి. అయితే పెట్రోల్​, డీజిల్ ఇంజిన్​లను మెయింటైన్ చేయడానికి, ఈ బ్యాటరీలు మెయింటైన్ చేయడానికి చాలా తేడా ఉంటుంది. లిథియం-అయాన్ బ్యాటరీలను మంచి నైపుణ్యం ఉన్న టెక్నీషియన్​లు ద్వారా మాత్రమే టెస్ట్​ చేయించాలి. ఒక వేళ మీ వెహికల్ బ్యాటరీలో ఏదైనా లోపాలు తలెత్తినా, అకస్మాత్తుగా ఏవైనా మార్పులు గమనించినా, వెంటనే ఎక్స్​పర్ట్ సహాయం తీసుకోవాలి. లేకపోతే వేరే బ్యాటరీ మార్చాలి. అప్పుడే మీ ఈవీ కారు దీర్ఘకాలంపాటు సురక్షితంగా ఉంటుంది.
  2. ఛేంజ్​ ఫ్యూయెల్స్ & లూబ్రికెంట్స్​ :
    సాధారణ వాహనాలతో పోల్చితే ఎలక్ట్రిక్ వాహనాలకు ఆయిల్ మార్చే అవసరం పెద్దగా ఉండదు. అయినప్పటికీ బ్రేకులు, తదితర స్పేర్ పార్ట్స్ బాగా పనిచేయాలంటే, సమయానుకూలంగా ఫ్యూయెల్స్​, లూబ్రికెంట్స్ మార్చుతూ ఉండాలి. ఇలా చేయటం ద్వారా బ్రేకింగ్ సిస్టమ్ మెరుగ్గా ఉండటంతో పాటు కారు మంచి కండీషన్​లో ఉంటుంది. అందుకే సకాలంలో బ్రేక్ ఆయిల్స్, వాషర్ ఫ్లూయిడ్స్ మారుస్తూ ఉండాలి.
  3. రొటేట్​ టైర్స్​
    మీ కార్​ టైర్లు సరిగ్గా ఉన్నాయో? లేదో? చెక్​ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ అవి పాడైపోతే సరైన సమయానికి మార్చాలి. ఎందుకంటే టైర్లు సరిగ్గా లేకపోతే కారు ఇంజిన్​పై ప్రభావం పడుతుంది. పైగా దీని వల్ల దీర్ఘకాలంలో వాహనం పనితీరు దెబ్బతింటుంది. ఒక్కోసారి ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది.
  4. చెక్​ సస్పెన్షన్​
    సస్పెన్షన్​ అనేది వాహనం ప్రధాన నిర్మాణానికి, ముఖ్యమైన భాగాలకు రక్షణ వ్యవస్థలాగా పనిచేస్తుంది. అలాగే ప్రయాణం సౌకర్యవంతంగా సాగడానికి ఇదే ప్రధాన కారణం అవుతుంది. అయితే సంప్రదాయ ఇంధనాలతో నడిటే వాహనాల లాగానే, ఎలక్ట్రిక్ కార్లకు కూడా రోడ్లపై అనేక సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా గతుకుల రోడ్లపై కార్లు నడిపేటప్పుడు సస్పెన్షన్​ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది. అందువల్ల క్రమానుగతంగా కార్​ సస్పెన్షన్​ను తనిఖీ చేస్తుండాలి. అవసరమైతే దానిని రిపేర్ చేయించుకోవాలి.
  5. రీప్లేస్​ క్యాబిన్ ఎయిర్​ఫిల్టర్స్/ వైపర్స్​
    ఐసీఈ పవర్డ్​ వెహికల్స్​ మాదిరిగానే ఎలక్ట్రిక్ కార్లలోనూ క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్స్​ ఉంటాయి. వీటి ద్వారానే కారులోకి స్వచ్చమైన గాలి వస్తుంది. కనుక మీ ఎలక్ట్రిక్ కారు ఎయిర్​ ఫిల్టర్​లను తరచుగా శుభ్రపరుస్తూ ఉంచాలి. ఒకవేళ అవి పాడయిపోతే, వెంటనే వాటిని మార్చుకోవాలి. అలాగే కారు విండ్​షీల్డ్ వైపర్స్ కూడా మారుస్తూ ఉండాలి. అప్పుడే కారు దీర్ఘకాలం పాటు మంచి కండిషన్​లో ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details