తెలంగాణ

telangana

ETV Bharat / business

తగ్గిన వాణిజ్య సిలిండర్‌ ధర- ఎంతంటే? - GAS CYLINDER PRICE

కమర్షియల్ ఎల్​పీజీ ధర స్వల్పంగా తగ్గింపు

Gas Cylinder Price Today
Gas Cylinder Price Today (ANI)

By ETV Bharat Telugu Team

Published : Feb 1, 2025, 8:49 AM IST

Gas Cylinder Price Today : వాణిజ్య అవసరాలకు ఉపయోగించే వంట గ్యాస్​ ధర స్వల్పంగా తగ్గింది. 19 కేజీల ఎల్​పీజీ సిలిండర్‌ ధరను రూ.7 తగ్గిస్తున్నట్లు కేంద్ర చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో కమర్షియల్‌ గ్యాస్ సిలిండర్‌ ధర రూ.1,797కు తగ్గింది. తగ్గించిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. అయితే, 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్‌ ధరలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు.

గత ఐదు నెలలుగా పెరుగుతూ వచ్చిన వాణిజ్య ఎల్​పీజీ సిలిండర్ ధర జనవరిలో స్పల్పంగా తగ్గింది. 2025 జనవరి 1న 19 కిలోల ఎల్​పీజీ సిలిండర్ ధరను రూ.14.5 మేర తగ్గింది.

నోట్​ : ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్​ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్​ (బీపీసీఎల్​), హిందూస్థాన్​ పెట్రోలియం కార్పొరేషన్​ (హెచ్​పీసీఎల్)లు - బెంచ్​మార్క్​ ఇంటర్నేషనల్ ఫ్యూయెల్​, ఫారిన్ ఎక్స్ఛేంజ్​ రేట్​ ఆధారంగా, ప్రతినెలా వంట గ్యాస్​ ధరలు, ఏటీఎఫ్​ ధరలను సవరిస్తూ ఉంటాయి.

గ్యాస్ సిలిండర్ ధరలను ఎక్కడ చెక్ చేయాలి?
ఎల్​ పీజీ సిలిండర్ అసలు ధరలను తెలుసుకోవాలనుకుంటే ఇండియన్ ఆయిల్​ అధికారిక వెబ్​సైట్​ https://iocl.com/prices-of-petroleum-productsలో చూడవచ్చు. ఇదే వెబ్​సైట్​లో ఎల్​పీజీ ధరలతోపాటు, జెట్​ ఫ్యూయెల్​, ఆటో గ్యాస్​, కిరోసిన్​ మొదలైన ఇంధనాల ధరలను కూడా తెలుసుకోవచ్చు.

ABOUT THE AUTHOR

...view details