Best Tips to Improve Car Resale Value :కారు కొనేవారు తక్కువ ధరకే రావాలని అనుకుంటారు. అదే సమయంలో అమ్మేవారు మంచి ధర రావాలని కోరుకుంటారు. మరి.. విక్రయించే వారికి మంచి ధర రావాలంటే కొన్ని సూచనలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సర్వీస్ హిస్టరీ డాక్యుమెంట్స్ :రెగ్యులర్‌గా సర్వీస్ చేయించండి. సర్వీస్ హిస్టరీ రికార్డులు దగ్గర పెట్టుకోండి.ఇవి మీ కారు రీసేల్ పెంచడంలో చాలా బాగా సహాయపడతాయి. మీ కారు సర్వీస్ హిస్టరీ రికార్డులు.. వెహికల్‌ను రెగ్యులర్ సర్వీసింగ్ చేయించిన నమ్మకాన్ని కొనుగోలుదారునికి కలిగిస్తాయి. అంతేకాదు.. సమయానికి సర్వీసింగ్ చేస్తే.. మీ కారు కూడా మంచి కండీషన్లో ఉంటుంది. దాంతో.. మంచి ధరకు అమ్మేయవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఇప్పటివరకు కారు సర్వీస్ హిస్టరీ లేకపోతే వెంటనే మీ సర్వీస్ సెంటర్‌ను సంప్రదించి ఆ పత్రాలను పొందండి. కారు బీమా రెన్యూవల్ చేయించడం మరిచిపోవద్దు. ఇది కూడా కారుకు మంచి ధర రావడంలో సహాయపడుతుంది.
మెయింటెనెన్స్ :మెయింటెనెన్స్ కూడా.. ధరలో కీలక పాత్ర పోషిస్తుంది. కారులో ఏదైనా పార్ట్ దెబ్బతిన్నప్పుడు ఒరిజినల్ పార్ట్స్నే వేయించండి. ఎందుకంటే అవి కారును కొత్తదానిలా చేస్తాయి. దాంతో రీసేల్ వ్యాల్యూ పెరిగే అవకాశం ఉంటుంది.
కారు క్లీన్‌గా :చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే కారులో అనవసరమైన వస్తువులు పెడుతూ దానిని డస్ట్‌బిన్‌లా మార్చుతుంటారు. అలాకాకుండా ఎప్పుడు వెహికల్ శుభ్రంగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే కారు మంచి కండిషన్లో ఉన్నా బయట చూడడానికి అసహ్యంగా కనిపిస్తే కొనుగోలుదారునికి అది డొక్కు కారులా అనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి కారును లోపల, బయట క్లీన్‌గా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం.
మోడిఫికేషన్స్ చేయకండి : మీ కారు రీసేల్ వ్యాల్యూ పెరగాలంటే దానిని వీలైనంతవరకు మోడిఫికేషన్స్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే.. అది కొనుగోలుదారునికి నచ్చకపోవచ్చు. కారు రూపం దెబ్బతిన్నదని వారు భావించొచ్చు. అప్పుడు వారికి నచ్చిన రేటుకే కారును విక్రయించాల్సి రావొచ్చు. దీనివల్ల మీకు మోడిఫికేషన్ ఖర్చు మైనస్ అవుతుంది. ఇటు రీసేల్ వాల్యూ తగ్గుతుంది. ఇలా రెండు విధాలా నష్టమే. కాబట్టి మోడిఫికేషన్స్ మానుకోవడం మంచిది.