Bank Holidays In June 2024 :రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2024 జూన్ నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం, దేశంలోని వివిధ బ్యాంకులకు ఏకంగా 10 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. వీటిలో కొన్ని జాతీయ సెలవులు, మరికొన్ని ప్రాంతీయ సెలవులు ఉన్నాయి. అందువల్ల కస్టమర్లు ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని, తమ అవసరాలకు అనుగుణంగా బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవడం మంచిది.
List Of Bank Holidays In June 2024
2024 జూన్ నెలలో బ్యాంక్ సెలవుల జాబితా ఇదే!
- జూన్ 2 (ఆదివారం) : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బ్యాంకులకు సెలవు.
- జూన్ 9 (ఆదివారం) :మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా హిమాచల్ ప్రదేశ్, హరియాణా, రాజస్థాన్ల్లోని బ్యాంకులకు సెలవు.
- జూన్ 10 (సోమవారం) :శ్రీ గురు అర్జున్ దేవ్జీ వర్ధంతి సందర్భంగా పంజాబ్లోని బ్యాంకులకు సెలవు.
- జూన్ 14 (శుక్రవారం) : పహిలి రాజా పండుగ సందర్భంగా ఒడిశాలోని బ్యాంకులకు సెలవు.
- జూన్ 15 (శనివారం) :రాజా సంక్రాంతి సందర్భంగా ఒడిశాలో; యంగ్ మిజో అసోసియేషన్ డే సందర్భంగా మిజోరంలోని బ్యాంకులకు సెలవు.
- జూన్ 16 (ఆదివారం) :
- జూన్ 17 (సోమవారం) :బక్రీద్/ ఈద్-అల్-అదా సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులన్నింటికీ సెలవు. (కొన్ని రాష్ట్రాల్లో తప్ప)
- జూన్ 21 (శుక్రవారం) : వట్ సావిత్రి వ్రతం సందర్భంగా పలు రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు ఉంటుంది.
- జూన్ 22 (శనివారం) :సంత్ గురు కబీర్ జయంతి సందర్భంగా ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, హరియాణా, పంజాబ్ రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు.
- జూన్ 30 (ఆదివారం) : రెమ్నా ని (శాంతి దినోత్సవం) సందర్భంగా మిజోరంలోని బ్యాంకులకు సెలవు.