Instant Personal Loan Approval Tips :ఆర్థిక అవసరాలు ఎప్పుడు, ఏ విధంగా వస్తాయో చెప్పలేము. ఇలాంటి పరిస్థితుల్లో అత్యవసరంగా డబ్బులు కావాల్సి ఉంటుంది. ఇళ్లు, పొలాలు, బంగారం లాంటివి తనఖా పెట్టి డబ్బులు తీసుకోవచ్చు. కానీ ఈ రుణాలు మంజూరు కావడానికి కాస్త సమయం పడుతుంది. ఒక వేళ ఇలాంటి స్థిరాస్తులు లేకపోతే రుణం పొందడం కష్టమవుతుంది. ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు కూడా ఏదో ఒక హామీ లేకుండా అప్పు ఇవ్వరు. పైగా అధిక వడ్డీ వసూలు చేస్తారు.
ఇలాంటి పరిస్థితుల్లో అందరికీ గుర్తొచ్చేవి వ్యక్తిగత రుణాలు. వీటికి ఎలాంటి హామీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. పైగా ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు విధించే వడ్డీ కంటే, బ్యాంకులు విధించే వడ్డీ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఇన్స్టెంట్ పర్సనల్ తీసుకునేందుకు మొగ్గు చూపుతారు. అయితే ఇన్స్టెంట్ పర్సనల్ లోన్లు అసురక్షితమైనవి. తక్కువ డాక్యుమెంటేషన్‌తో ఈ లోన్లు నిమిషాలు లేదా గంటల వ్యవధిలోనే అప్రూవల్ అయిపోతాయి. దీంతో మీ అవసరం కోసం త్వరగా నిధులను పొందొచ్చు. ఈ క్రమంలో ఇన్స్టెంట్ పర్సనల్ లోన్ అప్రూవల్ ఈజీగా, వేగంగా పూర్తయ్యేందుకు పాటించాల్సిన చిట్కాలు ఏంటో తెలుసుకుందాం.
లోన్ అమౌంట్, కాల వ్యవధి
ఇన్స్టెంట్ పర్సనల్ లోన్ కోసం అప్లై చేసే ముందు మీకు అవసరమైన నగదు మొత్తాన్ని అంచనా వేసుకోండి. ఆ మొత్తం మీ ఆదాయం, తిరిగి చెల్లించే సామర్థ్యానికి అనుగుణంగా ఉందో లేదో సరిచూసుకోండి. అలాగే లోన్ కాలవ్యవధిని పరిశీలించాలి. ఎందుకంటే సుదీర్ఘ కాలవ్యవధికి లోన్ తీసుకుంటే నెలవారీ ఈఎంఐ భారం తగ్గినా, అసలుపై అధిక వడ్డీ పడిపోతుంది.