Find the Difference in Pooja Hegde Images: "ఒక లైలా కోసం" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పూజా హెగ్డే.. బుట్టబొమ్మగా తార స్థాయికి చేరుకుంది. టాలీవుడ్లో టాప్ స్టార్స్‌తో నటించి ఓ వెలుగు వెలిగింది. అయితే.. కొంత కాలంగా ఈ అమ్మడిని పరాజయాలే పలకరిస్తున్నాయి. రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య, బాలీవుడ్లో 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్'.. ఇలా వరుస చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత మహేష్ బాబు 'గుంటూరు కారం'లో ఆఫర్ వచ్చినప్పటికీ.. అనివార్య కారణాలతో తప్పుకుంది. దీంతో.. ఇప్పుడు ఈ బ్యూటీ చేతిలో ఏ సినిమా కూడా లేకుండా పోయింది.
అయితే.. తాజాగా ఓ ప్రాజెక్ట్ గురించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 'ఒక లైలా కోసం' సినిమాతో సూపర్ పెయిర్ అనిపించుకున్న నాగచైతన్య - పూజా హెగ్డే మరోసారి ప్రేక్షకులను అలరించనుందని దాని సారాంశం. దాంతోపాటు నందినీరెడ్డి - సిద్దూ జొన్నలగడ్డ కాంబోలో రానున్న సినిమాలోనూ పూజా హెగ్డే మెరవనుందని టాక్. వీటిపై ఇంతవరకు అఫీషియల్‌గా అనౌన్స్మెంట్ రాలేదు.
చేతిలో సినిమాలు లేకపోయినప్పటికీ.. సోషల్ మీడియా వేదికా ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉంది పూజా. భారీగా ఫాలోవర్లున్న పూజా.. ఏ పోస్ట్ చేసినా తెగ వైరల్ అవుతుంటాయి. ఇటీవల పోస్ట్ చేసిన ఓ పిక్‌ను మీ కోసం తీసుకొచ్చాం. ఇందులో మొత్తం 6 తేడాలు ఉన్నాయి. మీరు 8 సెకన్లలో వీటిని ఫైండ్ చేస్తే మీ బ్రెయిన్ షార్ప్ అని ఒప్పుకోవాల్సిందే.