తెలంగాణ

telangana

ETV Bharat / bharat

స్వీట్​ షాప్​ స్టైల్లో "బూందీ లడ్డూ" - ఈ టిప్స్​తో తయారు చేస్తే అమోఘమైన రుచి! - Boondi Laddu Recipe Making Process - BOONDI LADDU RECIPE MAKING PROCESS

Boondi Laddu : స్వీట్స్​ అంటే చాలా మందికి ఇష్టం. అందులోనూ బూందీ లడ్డు అంటే మరీమరీ ఇష్టం. అయితే.. వీటిని ఇంట్లో తయారు చేయడం మాత్రం అందరికీ రాదు. అలాంటి వారు ఈ టిప్స్​ పాటిస్తూ చేస్తే.. అద్దిరిపోయే టేస్ట్​తో బూందీ లడ్డు తయారవుతుంది. మరి, ఈ రెసిపీ తయారీ విధానమేంటో ఈ స్టోరీలో చూద్దాం..

Boondi Laddu
Boondi Laddu (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 12, 2024, 12:26 PM IST

Home Made Boondi Laddu Recipe Making:నోట్లో వేసుకుంటే కరిగిపోయే బూందీ లడ్డూ అంటే ఎంతో మందికి ఇష్టం. హ్యాపీ అకేషన్​ ఏదైనా ఇది ఉండాల్సిందే. అంతేనా పెళ్లి భోజనాల్లో సైతం ఇది ఉండాల్సిందే. అయితే చాలా మందికి బూందీ లడ్డూను ఇంట్లో చేయడం రాదు. చేసినా అంతగా కుదరదు. కాబట్టి.. తినాలనిపించినప్పుడల్లా, అవసరం ఉన్నప్పుడల్లా స్వీట్​ షాప్​కి వెళ్లి తెచ్చుకుంటుంటారు. అయితే ఇప్పుడా అవసరం లేదు. ఎందుకంటే పర్ఫెక్ట్​ కొలతలతో ఈ టిప్స్​ పాటిస్తూ ఇంట్లో చేస్తే లడ్డూ టేస్ట్​ సూపర్​గా ఉంటుంది. మరి, దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం..

బూందీ లడ్డూకు కావాల్సిన పదార్థాలు:

  • శనగ పిండి - 1 కేజీ
  • నీరు - తగినంత
  • నూనె - వేయించడానికి సరిపడా

పాకం కోసం:

  • పంచదార - 1కేజీ
  • నీరు - 700 ml
  • యాలకుల పొడి - 1 టీస్పూన్​
  • నిమ్మరసం - నాలుగు చుక్కలు

డ్రై ఫ్రూట్స్​:

  • జీడిపప్పు - 100 గ్రాములు
  • ఎండు ద్రాక్ష - 50 గ్రాములు
  • పచ్చకర్పూరం - చిటికెడు

ముంబయి స్ట్రీట్ స్టైల్ 'పావ్‌భాజీ' - ఇలా చేస్తే నిమిషాల్లోనే ప్రిపేర్! - పైగా టేస్ట్​ సూపర్​!

తయారీ విధానం:

  • ముందుగా శనగపిండిని జల్లించుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ గిన్నె తీసుకుని జల్లించిన శనగపిండి వేసుకుని నీళ్లు కొద్దికొద్దిగా పోసుకుంటూ ఉండలు లేకుండా దోశ పిండి కన్నా కొంచెం జారుడుగా ఓ మూడు నిమిషాల పాటు కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత స్టౌ ఆన్​ చేసి బాండీ పెట్టి డీప్​ ఫ్రై కి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి.
  • ఇప్పుడు మరో స్టౌ ఆన్​ చేసి గిన్నె పెట్టుకుని పంచదార వేసి నీళ్లు పోసుకోవాలి. పంచదార కరిగిన తర్వాత దానిపై ఏమైనా మలినాలు ఉంటే తీసేసి.. ఒక తీగ పాకం వచ్చే వరకు మరిగించుకుని ఆపై యాలకుల పొడి వేసి స్టవ్​ ఆఫ్​ చేసుకోవాలి. తర్వాత అందులో నాలుగు చుక్కల నిమ్మరసం కలుపుకుంటే పాకం గట్టిపడకుండా ఉంటుంది.
  • ఇప్పుడు మరుగుతున్న నూనెకి దగ్గరగా బూందీ గరిటె పెట్టి కలిపిన శనగపిండి మిశ్రమాన్ని కొద్దికొద్దిగా పోసుకుంటూ గరిటెతో చిన్నగా తిప్పుతుంటే బూందీ నూనెలోకి పడుతుంటుంది.
  • అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే శనగపిండిని ఎక్కువ మొత్తంలో బూందీ గరిటెలో వేసుకుంటే పిండి ముద్దలు ముద్దలుగా పడుతుంది. కాబట్టి కొద్దికొద్దిగా వేసుకుంటూ చేసుకోవాలి.
  • ఇప్పుడు బూందీ లైట్​ గోల్డెన్​ బ్రౌన్​ కలర్​ వచ్చేవరకు వేయించుకుని తీసి వేడి వేడి పంచదార పాకంలో పోసి కలుపుకోవాలి. అయితే ఇక్కడ బూందీని ఎర్రగా వేయించుకోవాల్సిన అవసరం లేదు.

క్రిస్పీ అండ్​ స్పైసీ సేమియా వెజ్​ కట్​లెట్స్​ - ఇలా చేశారంటే మమ్మీ ఇట్స్​ టూ యమ్మీ అనడం పక్కా! -

  • ఇప్పుడు పిండి మొత్తాన్ని ఈ విధంగానే చేసుకుని పంచదార పాకంలో వేసుకుని కలుపుకోవాలి.
  • ఇప్పుడు మరుగుతున్న నూనెలోనే జీడిపప్పు, కిస్మిస్​ వేసి వేయించుకుని బూందీ లడ్డూ మిశ్రమంలో కలుపుకోవాలి. అలాగే అందులోకి పచ్చ కర్పూరం కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఓ పది నిమిషాలు ఆ మిశ్రమాన్ని పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు పది నిమిషాల తర్వాత బూందీ లడ్డూ మిశ్రమం గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఒక టీస్పూన్​ నెయ్యి వేసి కలుపుకుని చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుంటూ లడ్డూల్లా చుట్టుకోవాలి. ఇలా మిశ్రమం మొత్తాన్ని లడ్డూల్లా చేసుకోవాలి.
  • ఇప్పుడు వీటన్నింటినీ ఓ గంట పాటు పక్కకు పెట్టుకోవాలి. గంట తర్వాత వాటిని గాలి చొరబడని డబ్బాల్లో పెట్టుకుంటే సరి.
  • ఎంతో రుచిగా ఉండే బూందీ లడ్డూ రెడీ. అయితే బూందీ లడ్డూ పర్ఫెక్ట్​గా రావాలంటే కచ్చితంగా తీగ పాకం రావాలి.

పది నిమిషాల్లో పసందైన పచ్చి పులుసు - చాలా మందికి తెలియని టిప్స్!

ABOUT THE AUTHOR

...view details