Haryana Exit Polls:హరియాణా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే వివిధ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను వెలువరించాయి. 90 ఆసెంబ్లీ నియోజకవర్గాలున్న ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 46 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. మెజార్టీ సర్వే సంస్థలు కాంగ్రెస్ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అభిప్రాయపడ్డాయి. దీనితో హరియాణాలో వరుసగా మూడో దఫా అధికారం చేపట్టాలన్న బీజేపీకి నిరాశే ఎదురైనట్టు కనిపిస్తోంది.
హరియాణా ఎగ్జిట్ పోల్స్- కాంగ్రెస్‌కే ప్రజల మొగ్గు! - Haryana Exit Polls - HARYANA EXIT POLLS
Haryana Exit Polls : హరియాణాలోని 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ పూర్తయింది. వివిధ సర్వే సంస్థలు తాజాగా ఎగ్జిట్ పోల్స్ వివరాలను వెల్లడించాయి.
Published : Oct 5, 2024, 7:06 PM IST
|Updated : Oct 5, 2024, 8:00 PM IST
అసెంబ్లీ ఎన్నికల వేళ హరియాణాలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న హరియణా పీఠాన్ని సొంతం చేసుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ తమ శక్తికి మించి కృషి చేశాయి. వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ , ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేశాయి. శనివారం పోలింగ్ దశ ముగియడం వల్ల వివిధ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ప్రకటించాయి.
- పీపుల్స్ పల్స్- సౌత్‌ఫస్ట్ సర్వే : కాంగ్రెస్ 55 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. బీజేపీ 26, ఐఎన్‌ఎల్‌డీ 2-3, జేజేపీ 0-1, ఇతరులు 3-5 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది.
- రిపబ్లిక్ మ్యాట్రిజ్:హరియాణాలో రిపబ్లిక్ మ్యాట్రిజ్ సర్వే కూడా కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపింది. కాంగ్రెస్: 55-62, బీజేపీ 18-24, ఐఎన్‌ఎలడీ+బీఎస్పీ: 3-6, జేజేపీ: 0-3, ఇతరులు: 2-5 చోట్ల విజయం సాధించే అవకాశముందని సర్వే పేర్కొంది.
- ధ్రువ్ రీసెర్చ్: కాంగ్రెస్: 57-64, బీజేపీ : 27-32, ఇతరులు: 5-8
- దైనిక్ భాస్కర్: ఈ సర్వే సైతం హరియాణాలో కాంగ్రెస్ పార్టీ ఈ దఫా ప్రభుత్వాన్ని ఎర్పాటు చేసే అవకాశముందని పేర్కొంది. కాంగ్రెస్ 44 నుంచి 54 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తుందని తెలిపింది. బీజేపీ 15 నుంచి 19 సీట్లకే పరిమితమవుతుందని పేర్కొంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక చోట గెలిచే అవకాశముందని తెలిపింది. ఐఎన్‌ఎల్‌డీ-బీఎస్‌పీ కూటమి 1 నుంచి 5 చోట్ల విజయం సాధించే అవకాశముంది. జేజేపీ ఒకచోట ఇతరులు 4 నుంచి 9 చోట్ల గెలిచే అవకాశముంది.
- ధ్రువ్ రీసర్చ్ సర్వే : ఈ సర్వే కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపింది. కాంగ్రెస్‌కు 50 నుంచి 64 సీట్లు వస్తాయని పేర్కొంది . బీజేపీ 22 నుంచి 32 సీట్లకే పరిమితం కానుంది. ఐఎన్‌ఎల్‌డీ-బీఎస్‌పీ కూటమికి ఒక్క సీటు కూడా దక్కదని పేర్కొంది. ఇతరులు 2 నుంచి 8 చోట్ల విజయం సాధించే అవకాశముంది.
- పీమార్క్ సర్వే :ఈ సర్వే 51 నుంచి 61 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించే అవకాశముందని తెలిపింది. బీజేపీ 27 నుంచి 35 స్థానాలకు, ఐఎన్‌ఎల్‌డీ-బీఎస్‌పీ కూటమికి 3 నుంచి 6 సీట్లు దక్కనున్నాయని అంచనా వేసింది.