తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఇట్లు మీ గోపిక!'- కోరికలు నెరవేర్చాలని కన్నయ్యకు రిక్వెస్ట్ లెటర్స్!! - Unique Radha Krishna temple - UNIQUE RADHA KRISHNA TEMPLE

Devotees Letter To Lord Krishna : మధ్యప్రదేశ్​లోని ఓ రాధాకృష్ణుల ఆలయంలోని కన్నయ్య మహిళా భక్తులను గోపికలుగా భావించి వారి కోరికలు తీర్చుతాడట. అయితే లేఖలు రాసి సమర్పిస్తే తీర్చేందుకు సిద్దంగా ఉంటాడట.

Devotees Letter To Lord Krishna
Devotees Letter To Lord Krishna (Etv Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 12, 2024, 11:24 AM IST

Devotees Letter To Lord Krishna :రాధాకృష్ణుల ప్రేమ చాలా గొప్పదని వింటుంటాం. అందుకే వీరి ప్రేమపై పురాణాల్లో చాలా కథలు ఉన్నాయి. కన్నయ్య, రాధ ప్రేమకు చిహ్నంగా మధ్యప్రదేశ్​లోని సాగర్ జిల్లాలోని గణేశ్ ఘాట్​లో దేవాలయం ఉంది. ఇక్కడి వెలిసిన కన్నయ్య, గోపికలు కోరికలు మాత్రమే విని తీర్చుతాడని భక్తులకు నమ్మకం. అందుకే మహిళా భక్తులు కన్నయ్యను తమ కోరికలను తీర్చమని వేడుకుంటారు.

కృష్ణయ్యకు మహిళలు రాసిన లేఖ! (ETV Bharat)

మహిళలు కోరికలు తీర్చే కన్నయ్య
గోపికలుగా భావించి మహిళలు కన్నయ్యకు లేఖలు రాయాలి. అందులో తమ కోరికలను పొందుపర్చాలి. లేఖ కింద 'నీ గోపిక' అని రాయాలి. ఈ లేఖలను రాధాకృష్ణుని ఆలయానికి కట్టాలి. ఆ లేఖ కింద పడిపోతే, దాన్ని కన్నయ్య చదివినట్లు లెక్క. ఆపై భక్తుల కోరిక నేరవేరుతుందని నమ్మకం. లఖా బంజారా సరస్సులోని గణేశ్ ఘాట్ వద్ద ఉన్న చారిత్రక రాధాకృష్ణుల దేవాలయంపై స్థానిక ప్రజలకు అపారమైన విశ్వాసం ఉంది. ఇక్కడ ఏర్పాటు చేసిన శ్రీకృష్ణుని విగ్రహం బృందావనంలో కన్నయ్య విగ్రహంలానే ఉంటుంది.

ఆలయంలో కృష్ణుడు, రాధ (ETV Bharat)

"ఆలయాన్ని 1655లో నిర్మించారు. ఇందులో మధుర బృందావనంలో ఉన్న కృష్ణుడి విగ్రహం లాంటిదాన్నే ఏర్పాటు చేశారు. అంతకుముందు ఆలయంలో శ్రీకృష్ణుడి విగ్రహం మాత్రమే ఉండేది. ఒకసారి శంకరాచార్యులు ఆలయాన్ని సందర్శించినప్పుడు రాధ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించాలని సలహా ఇచ్చారు. ఆ తర్వాత రాధా మాత విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించాం. కానీ కన్నయ్య పక్కనే ప్లేస్ లేకపోవడం వల్ల కొద్దిగా వెనుకగా రాధ విగ్రహాన్ని పెట్టాం."

--గోవింద్‌రావు అథలే, ఆలయ కార్యనిర్వహణాధికారి

ప్రత్యేకతలివే!
అయితే సాగర్​లోని శ్రీరాధా కృష్ణ దేవాలయాలనికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆలయం ప్రత్యేకంగా ఒక బావిపై ఏర్పాటైంది. బావిలోని నీరు ఎల్లప్పుడూ దేవాలయం ప్రాంగణాన్ని తాకుతుంది. ఆలయ నిర్మాణ సమయంలో దేవాలయం పవిత్రతను కాపాడేందుకు పెద్దలు ఈ పద్ధతిని అనుసరించారని చెబుతున్నారు. నేటికీ ఈ ఆలయం ప్రాంగణాన్ని బావిలోని నీరు తాకుతోంది. రాధా అష్టమి రోజున ఈ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్ని రాధాకృష్ణులను దర్శించుకుంటారు.

శివుడికి భక్తుల పిటిషన్లు- రోజూ చదివి వినిపించే పూజారి- ఇలా చేస్తే కోరికలు తీరుతాయట! - Arji Wale Mahadev Temple

ఏలియన్స్​కు గుడి కట్టిన భక్తుడు- ఆ ప్రమాదం నుంచి కాపాడుతాయని వింత వాదన! - Alien Temple Salem

ABOUT THE AUTHOR

...view details