DA And MSP Hike : కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుకగా రైతులకు, ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు డీఏ 3 శాతం పెంచుతూ కేబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు రైతులకు 2025-26 రబీ సీజన్‌కు సంబంధించి ఆరు రకాల పంటలకు మద్దతు ధరను పెంచనున్నట్లు ప్రకటించింది. గోధుమల కనీస మద్దతు ధరను రూ.150 పెంచి క్వింటాల్‌కు రూ.2,425కు చేర్చినట్లు పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత బుధవారం జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ మేరకు వివరాలను వెల్లడించారు. అయితే కీలకమైన రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం ఈ కనీస మద్దతు ధరను పెంచడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఉద్యోగులకు కేంద్రం దీపావళి గిఫ్ట్- DA పెంపు- రైతులకు గుడ్‌న్యూస్ - DA AND MSP HIKE
రైతులకు, ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఉద్యోగులకు డీఏ పెంపు - ఆరు పంటలకు ఎమ్ఎస్పీ పెంచిన కేంద్రం

Published : Oct 16, 2024, 3:40 PM IST
53 శాతానికి డీఏ
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇప్పటి వరకు ఉన్న 50 శాతం డీఏ 53 శాతానికి చేరనుంది. ఇది 2024 జులై 1వ తేదీ నుంచే అమలు చేయనున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ తెలిపారు. దీని వల్ల కేంద్ర ఖజానాపై రూ.9,448 కోట్లు అదనపు భారం పడునుందని పేర్కొన్నారు. 49.18 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు, 64.89 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి పొందనున్నారని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.
పంటల కనీస మద్దతు ధర వివరాలు
2025-26 రబీ పంట సీజన్లో అత్యధికంగా కనీస మద్దతు ధరను ఆవాలుకు ప్రకటించారు. క్వింటాలుకు రూ.300 పెంచారు. పెసరకు రూ.275, శెనగలకు క్వింటాల్‌పై రూ.210, ప్రొద్దుతిరుగుడుకు రూ.140, బార్లీకి రూ.130 చొప్పున పెంచారు. గతేడాదితో పోలిస్తే ఈసారి కనీస మద్దతు ధర గణనీయంగా పెరిగిందని కేంద్రమంత్రి వైష్ణవ్ తెలిపారు.
ఒక్కో పంటకు కనీస మద్దతు ధర(క్వింటాలుకు) పెంపు ఇలా:
- గోధుములు : రూ.2425 - రూ. 2425
- బార్లీ : రూ.1850 - రూ.1980
- శెనగలు : రూ. 5650 - రూ.5440
- ఆవాలు : రూ.5650 - రూ. 6700
- పొద్దు తిరుగుడు : రూ. 5800 - రూ.5940
- పెసలు : రూ.6700 - రూ.6425