Man Climbed High Voltage Pole Viral Video : భార్య కాపురానికి రావడం లేదని హై టెన్షన్ విద్యుత్​ స్తంభం ఎక్కిన భర్త.. చివరకు..!

By ETV Bharat Telangana Team

Published : Oct 5, 2023, 6:04 PM IST

thumbnail

Man Climbed High Voltage Pole Viral Video : భార్య కాపురానికి రావడం లేదని.. ఓ వ్యక్తి మద్యం మత్తులో హైటెన్షన్ విద్యుత్‌ స్తంభం ఎక్కి హల్​చల్‌ చేసిన ఘటన హైదరాబాద్​లోని సైదాబాద్​లో చోటుచేసుకుంది. సైదాబాద్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని శంఖేశ్వర బజార్..​ స్థానిక సింగరేణి కాలనీలో మోహన్​ అనే వ్యక్తి నివాసముంటున్నాడు. గత కొన్ని రోజులుగా మోహన్​ మద్యానికి బానిస కావడంతో.. అతడి భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో సదరు వ్యక్తి.. భార్య కాపురానికి రావడం లేదని మద్యం సేవించి హైటెన్షన్​ విద్యుత్​ స్తంభం ఎక్కాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. 

Person Climbing High Voltage Pole Video Viral : ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. విద్యుత్​ అధికారులకు ఫోన్​ చేయడంతో కరెంట్​ నిలిపివేశారు. త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. పెద్ద సంఖ్యలో జనం గుమిగూడటంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసులు విద్యుత్ స్తంభం ఎక్కిన మోహన్ భార్యను పిలిపించి సముదాయించడంతో.. అతడు కిందకు దిగాడు. అనంతరం మోహన్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోహన్​ ఇలా హై ఓల్టేజ్​ విద్యుత్​ స్తంభం ఎక్కడం రెండేళ్లలో ఇది నాలుగోసారని స్థానికులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.