100 Lies of BJP CD and Booklet Released by BRS : 'వంద అబద్ధాల బీజేపీ' పేరుతో బీఆర్ఎస్ సీడీ, బుక్‌లెట్ - Hyderabad Latest News
🎬 Watch Now: Feature Video
100 Lies of BJP CD and Booklet Released by BRS : వంద అబద్ధాల బీజేపీ పేరిట బీఆర్‌ఎస్ సోషల్ మీడియా బృందం సీడీ, బుక్‌లెట్‌ను రూపొందించింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రగతి భవన్‌లోని జరిగిన కార్యక్రమంలో వాటిని విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రానికి, దేశానికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ వైఫల్యాలను బీఆర్ఎస్ సోషల్ మీడియా బృందం(BRS Social Media) గత నాలుగు నెలలుగా ప్రచారం చేస్తోంది. ఉద్యోగాల కల్పన, ద్రవ్యోల్బణం, జీఎస్టీ భారం, ఇంటింటికీ ఇంటర్నెట్, అందరికీ ఇళ్లు.. బయ్యారంలో ఉక్కు కర్మాగారం, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, విభజన చట్టం హామీలు, ఐటీఐఆర్, ఆదిలాబాద్ సిమెంట్ కర్మాగారం, వాల్మీకీలకు ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ వైఫల్యాలను సీడీ, బుక్‌లెట్‌ల్లో ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ బీజేపీ నేతలు నెరవేర్చని హామీలను పేర్కొన్నారు. వాటన్నింటినీ సీడీ, బుక్‌లెట్ రూపంలో సంకలనం చేశారు. బీజేపీ అబద్ధాలను ఇలా వెలుగులోకి తీసుకురావడం మంచి ప్రయత్నమని సోషల్ మీడియా కన్వీనర్లను కేటీఆర్ అభినందించారు.