బ్రేక్ ఫాస్ట్ అడ్డగోలుగా కాకుండా.. ఓ పద్ధతి ప్రకారం ప్రణాళిక వేసుకుని చేస్తే.. సగం ఆరోగ్యం అందుతుందంటున్నారు వైద్యులు.
ఉదయం పూట తీసుకునే ఆహారంలో పీచు తప్పనిసరిగా ఉండాలి. ఇందుకోసం రాగులు, జొన్నలు, సజ్జలతో చేసిన బ్రెడ్‌లు, అటుకులు, ఓట్‌మీల్ వంటివి చక్కని ప్రత్యామ్నాయాలు.
పీచు తర్వాత మనం తప్పనిసరిగా తీసుకోవాల్సినవి మాంసకృత్తులు. వీటికోసం పెరుగు, ఉడకబెట్టిన గుడ్లు తగిన ఆహారం. వీటి నుంచి మాంసకృత్తులతోపాటూ అత్యవసర విటమిన్లు, ఖనిజాలు కూడా అందుతాయి. వీటితోపాటు బాదం వంటి ఎండు పప్పులని కూడా చేర్చుకోవచ్చు.
టిఫిన్ అనగానే చాలామంది ఇంట్లో చేసుకోవడం ఎందుకులే అని బయట తినేస్తే పోలా అనుకుంటారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. బయట తినే ఆహారంలో ఉప్పు, నూనెల మోతాదు ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇంట్లోనే తినడం మంచిది. తాజా పండ్లు, సోయాపాలు, కాయగూరలతో చేసిన ఆమ్లెట్, బాదం... అక్రోట్ వంటి వాటిని తినొచ్చు.
ఇదీ చదవండి: రోజూ అక్కర్లేదు.. వారినికోసారైనా పర్లేదు!