ETV Bharat / sukhibhava

మీరు వెజిటేరియనా?.. మరి ఈ ఆహార పదార్థాలను తీసుకుంటున్నారా? - శాకాహారలు న్యూట్రిషన్ విలువలు

సరైన ఆహారం తీసుకుంటే అనేక అనారోగ్యాలను నివారించుకునే శక్తిని మనం పెంచుకున్నట్లే. శాకాహారం తీసుకుంచే అనేక అనారోగ్య సమస్యలను నివారించే అవకాశం ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే పూర్తిగా శాకాహారం తీసుకునేవారు పోషకాల లోపం ఏర్పడకుండా తగిన జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది. పలు ఆహార పదార్థాలను తినాలి. అవేంటో తెలుసుకుందాం.

vegetarian should take these foods
శాకాహారులు తీసుకోవాల్సిన ఆహారాలు
author img

By

Published : Feb 12, 2023, 9:02 AM IST

Updated : Feb 12, 2023, 2:23 PM IST

శాకాహారులు తీసుకోవాల్సిన ఆహారాలు

ఆరోగ్యంగా ఉండాలంటే శాకాహారమే తినాలనే ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది. శాకాహారంతో బరువు తగ్గడమే కాకుండా ఎక్కువ కాలం జీవిస్తారని కొన్ని అధ్యయనాలు సైతం చెబుతున్నాయి. అయితే మాంసాహారం స్థాయిలో.. శాకాహార పదార్థాల్లో ప్రొటీన్లు ఉండవు అనే అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంటుంది. గింజలు, విత్తనాలు, చిక్కుళ్లు, పప్పులు, ధాన్యాలు వంటి భిన్నమైన ఆహారాలను తీసుకుంటే శాకాహారులకు ప్రొటీన్లతో పాటు అన్నిరకాల పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శాకాహారులు తీసుకోవాల్సిన ఆహారపదార్థాలేంటే తెలుసుకుందాం.

తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు

  • చిక్కుళ్లు
  • కూరగాయలు
  • క్యారెట్లు
  • పుట్టగొడుగులు
  • పాలకూర
  • గుడ్లు
  • పాలు

"శాకాహారం తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని న్యూట్రియెంట్లు అనేవి శాకాహారంలో లభించవు కాబట్టి వీరు సప్లిమెంట్స్ మీద ఆధారపడాల్సి ఉంటుంది. విటమిన్ సప్లిమెంట్స్ తీసుకునే ముందు వైద్యుల్ని సంప్రదించి తీసుకోవాలి. పన్నీర్, టోఫు, సోయా చంక్స్​, మిల్​మేకర్, సోయాబీన్స్ అనేవి మన ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే సరైన ప్రొటీన్లు, విటమిన్లు మనం పొందవచ్చు. పప్పులు కూడా ఎక్కువగా తీసుకుంటే సరైన ప్రొటీన్ లభిస్తుంది. శాకాహారుల్లో విటమిన్ బీ12 డెఫిషియెన్సీ ఎక్కువగా ఉంటుంది. సరైన మోతాదులో సప్లిమెంట్స్ తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు"

--శుభాంగి తమ్మళ్వార్, న్యూట్రిషనిస్ట్

ఈ వ్యాధుల నుంచి బయటపడొచ్చు
శాకాహారులకు క్యాన్సర్ వచ్చే ప్రమాదంతోపాటు దీర్ఘకాలిక వ్యాధులు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం సైతం తక్కువగా ఉంటుందని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. శాకాహారులు ప్రతిరోజూ భోజనంలో ప్రొటీన్ ఉండేలా చూసుకోవాలి. వారు తప్పకుండా సోయా ప్రొటీన్ తీసుకోవాలి. శాకాహారులు.. నట్స్ తినడమే మంచిదైనా బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నవారు తక్కువగా ఉండేలా చూసుకోవాలి.

చక్కెర పదార్థాలు తగ్గించాలి
చక్కెరతో తయారుచేసిన పానీయాలు, తీపి పదార్థాలను తగ్గించాలి. పండ్ల రసాలను తీసుకోవడం కాకుండా పండ్లనే తినాలి. పోషకాహార లోపం లేకుండా చూసుకుంటూ అవసరమైతే వైద్యుల సలహా మేరకు సప్లిమెంట్లను వాడాల్సి ఉంటుంది. శాకాహారాన్ని ఇష్టపడేవారు తగిన జాగ్రత్తలను పాటిస్తూ ఆహారం తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Last Updated : Feb 12, 2023, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.