ETV Bharat / sukhibhava

లివర్​ చెడిపోతోందా? ఈ జాగ్రత్తలు పాటిస్తే మళ్లీ హెల్తీగా..

Healthy liver tips: లివర్​.. శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. మద్యం సేవించడం, రెడీ మేడ్​ ఫుడ్స్​ తినడం సహా ఎక్కువగా మందులు వాడటం లివర్​ పనితీరుపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా లివర్​ దెబ్బతినే అవకాశం ఉంది. మరి ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి ఆహారం తినాలి? దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే.

liver
లివర్​ చెడిపోతోందా
author img

By

Published : May 19, 2022, 2:28 PM IST

Healthy liver tips: శరీరంలో అతిపెద్ద భాగమైన లివర్.. జీర్ణక్రియలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. అటువంటి కీలక అవయమైన లివర్​కు ఫ్యాటీ లివర్​ సమస్య తలెత్తితే.. పనితీరు బాగా దెబ్బతింటుంది. కాలేయంలో కొవ్వు శాతం పరిమితికి (5 శాతానికి) మించి ఉంటే ఆ స్థితిని ఫ్యాటీ లివర్ అంటారు. ఇది జీర్ణక్రియపై చెడు ప్రభావం చూపిస్తుంది.

ఫ్యాటీ లివర్​ వస్తే ఏమవుతుంది?: ఫ్యాటీ లివర్​ కారణంగా కాలేయం క్రమంగా దెబ్బతింటుంది. దాని పనితీరులో సమస్యలు ఎదురవుతాయి. అలాంటి సమయంలో (Liver Disease Symptoms) చర్మం పసువు రంగులోకి మారుతుంది.శరీరంలో మోతాదుకు మించి విటమిన్ ఏ ఉండటమూ లివర్​పై ప్రభావం చూపుతుంది. చక్కెరలు ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకున్నా కాలేయ సమస్యలు వస్తాయి.

లక్షణాలు..

  • చలిలోనూ చమటలు రావడం
  • అధికంగా గురక రావడం
  • కడుపు నొప్పి
  • గ్యాస్ సమస్యలు

ఎందువల్ల వస్తుంది?: మద్యపానం, వైరల్ ఇన్​ఫెక్షన్​.. ఫ్యాటీ లివర్​కు ప్రధాన కారణాలు (Fatty Liver Causes). తీసుకునే ఆహారం, అలవాట్ల కారణంగానూ లివర్ చెడిపోతుంది. డయాబెటిస్, అధిక బరువు ఉన్నవారు దీని బారినపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

తగ్గాలంటే ఎలా?: ఈ వ్యాధికి మందుల కన్నా.. బరువు తగ్గడం, ఆహారపు అలవాట్లలో మార్పులు, షుగర్ అదుపు చేసుకోసుంటే అధికంగా ప్రయోజనం ఉంటుంది. మద్యం కారణంగా ఫ్యాటీ లివర్​ వచ్చిందని తేలితే.. ముందు మందు మానేయాలి. లేదంటే లివర్ చెడిపోతుంది.

మద్యం అలవాటు లేకున్నా ఫ్యాటీ లివర్ వచ్చినవారిలో.. డయాబెటిస్ ఉంటే దానిని అదుపులో పెట్టుకోవాలి. కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోరాదు. ముఖ్యంగా మసాలా పదార్థాలు, చల్లిని వస్తువులకు దూరంగా ఉండాలి. కూరగాయలు ఎక్కువగా తినాలి. ఇలాంటి జాగ్రత్తలతో ఫ్యాటీ లివర్​ ఉన్నవారి కాలేయం మెరుగుపడటమే కాక, లేనివారిలో ఈ వ్యాధి రాకుండే ఉండేందుకు దోహదం చేస్తాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

లివర్​ బాగుండాలంటే: త్రిఫలాలుగా పేర్కొనే కరక్కాయ, ఉసిరికాయ, తానికాయలు లివర్​కు యాంటీ ఆక్సిడెంట్స్​లా పనిచేస్తాయని అంటున్నారు నిపుణులు. శరీరంలోని మలినాలను బయటక పంపించే ఈ పదార్థాల ద్వారా లివర్​ దెబ్బ తినకుండా నివారించడం సహా ఆరోగ్యంగా ఉంచొచ్చని చెప్తున్నారు. వీటితో ఔషధ గుణాలు గల ఆహారాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే..

కావాల్సిన ద్రవ్యాలు- నెయ్యి, పాలు, పసుపు, త్రిఫలాలు, వేపాకుల చూర్ణం, బలావేర్ల చూర్ణం.

  • ఓ గిన్నెలో నీళ్లు, పాలు పోసి కాచాలి. పాలు ఎంత తీసుకున్నామో అందులో నాలుగో వంతు నెయ్యిని వెయ్యాలి.
  • ఇందులో ఇప్పుడు త్రిఫలాల చూర్ణాన్ని వెయ్యాలి. ఈ మూడింటిని 25 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఈ త్రిఫలాలు కొత్త కణాల ఉత్పత్తికి తొడ్పడతాయంటున్నారు నిపుణులు.
  • రక్తశుద్ధికి తోడ్పడే వేపాకు చూర్ణం సహా పసుపు 25 గ్రాములు ఆ మిశ్రమంలో కలుపుకోవాలి. ఇందులో అదనంగా బలావేర్ల చూర్ణాన్ని ఓ 25 గ్రాములు కలపాలి.

ఈ ద్రవ్యాలన్నింటిని కలిపి సన్నటి మంటపై కాగనివ్వాలి. నీటి శాతం పోయి కేవలం నెయ్యి మిగిలే వరకు వాటిని కాగనివ్వాలి. ఈ మిశ్రమాన్ని ఓ అరకప్పు వేడి వేడి పాలల్లో ఓ పెద్ద చెంచా పరిమాణంలో వేసి కలుపుకొని ప్రతిరోజు పరిగడుపునే తీసుకోవాలి. ఇలా రోజు తీసుకుంటే.. లివర్​ ఆరోగ్యంగా ఉంటుంది.

ఇదీ చూడండి : ఎక్కువసార్లు సెక్స్​లో పాల్గొంటే వేడి చేస్తుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.