ETV Bharat / sukhibhava

'ప్రీ- డయాబెటిక్' అంటే ఏంటి?.. ఈ దశలో మధుమేహం కట్టడి ఎలా? - ప్రీ డయాబెటిక్​ చికిత్స

Prediabetes symptoms and treatment: చిన్న వయసు వారి నుంచి పెద్దల వరకూ మధుమేహం సమస్య అందరికీ సాధారణమైపోయింది. ఈ వ్యాధి రాకముందే ప్రీ డయాబెటిక్​ దశలో వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎంటో చూద్దాం.

prediabetes symptoms
prediabetes symptoms
author img

By

Published : Jul 17, 2022, 4:43 PM IST

Prediabetes symptoms and treatment: మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సైతం ప్రభావితం చేస్తున్నాయి. రానున్న దశాబ్దకాలంలో ప్రపంచంలో అరవై కోట్ల మందికి పైగా ప్రజలు మధుమేహం బారిన పడతారని ఒక ప్రాథమిక అంచనా. వీరిలో మూడొంతుల మంది అల్పాదాయ దేశాలకు చెందినవారే ఉంటారని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రీ డయాబెటిక్​ దశలోనే మధుమేహాన్ని ఎలా నివారించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రీ డయాబెటిక్​​ అనేది మధుమేహానికి ముందు దశ. ఫాస్టింగ్​ గ్లూకోజ్​ చూసుకుంటే 100 నుంచి 126 మధ్యలో ఉంటుంది. గ్లూకోజ్​ తీసుకున్న రెండు గంటల తర్వాత పరీక్ష చేస్తే 140 నుంచి 200 ఉంటే దానిని ప్రీ డయాబెటిక్​గా నిర్ధరిస్తారు. హెచ్​బీఎ1సీ 5.7 నుంచి 6.5 మధ్యలో ఉంటే ప్రీ డయాబెటిస్​ అని చెప్పవచ్చు. ఒక్కసారి ఇది నిర్ధరణ అయితే మధుమేహం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

సరైన ఆహార శైలి, తరచూ వ్యాయామం, బరువు ఎక్కువగా ఉంటే తగ్గడం లాంటి జాగ్రత్తలు పాటిస్తే మధుమేహాన్ని ముందుగానే నివారించవచ్చని అంటున్నారు డాక్టర్లు. ప్రీ డయాబెటిక్ నిర్ధరణ అయ్యాక ప్రతీ ఆరు నెలలకు మధుమేహ పరీక్ష చేయిస్తే మంచింది. ఎందుకంటే ప్రీ డయాబెటిక్​గా నిర్ధరణ అయిన వారికి మధుమేహం వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.

ఇలా చేస్తే మధుమేహాన్ని ప్రీ డయాబెటిక్​లోనే నివారించవచ్చు!

ఇవీ చదవండి:

10 రోజుల్లో బరువు తగ్గాలా? ఇవిగో 10 టిప్స్​! సైడ్​ ఎఫెక్ట్స్​ లేకుండానే!!

తరచూ కడుపునొప్పి రావడం.. దానికి సంకేతమేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.