Peanuts Health Benefits In Telugu : ఇటీవల కాలంలో గుండె జబ్బులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనికి కారణం తెలుసుకునేందుకు యూరోపియన్ హార్ట్ జర్నల్ ఓ అధ్యయనం చేసింది. దీనిలో హానికరమైన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం కంటే.. మంచి పోషక విలువలు కలిగి ఆహారం తీసుకోకపోవడం వల్లే ఎక్కువగా హృదయ సంబంధ రోగాలు పెరుగుతున్నాయని తేలింది.
గుండె సమస్యలకు కారణాలు!
యూరోపియన్ జర్నల్ 80 దేశాల్లో నిర్వహించిన ఈ అధ్యయనంలో.. పోషకాహార లోపం వల్లే హార్డ్ ఎటాక్, హార్ట్ స్ట్రోక్ సమస్యలు బాగా పెరుగుతున్నాయని తెలిసింది. నేటి కాలంలో చాలా మంది పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్లు, గింజలు, చేపలు, కొవ్వు కలిగిన పాల ఉత్పత్తులను సరైన మోతాదులో తీసుకోవడం లేదు. దీని వల్లే ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
ఓవర్‌గా తింటే.. ఇక అంతే!
ప్రాస్పెక్టివ్ అర్బన్ రూరల్ ఎపిడెమియాలజీ (PURE) చేసిన అధ్యయనంలో మరికొన్ని కీలకమైన అంశాలు బయటపడ్డాయి. నేటి కాలంలో చాలా మంది ఎక్కువ మోతాదులో కార్బొహైడ్రేట్స్ తీసుకుంటున్నారు. అదే సమయంలో పండ్లు, కూరగాయలు, అసంతృప్త కొవ్వులు పదార్థాలు తక్కువగా తీసుకుంటున్నారు. ఇది కూడా గుండె సమస్యలు పెరగడానికి కారణం అవుతోంది.
వేరుశెనగలు తింటే గుండె జబ్బులు తగ్గుతాయా?
అమెరికన్ స్ట్రోక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నడిచే స్ట్రోక్ జర్నల్ ప్రకారం, వేరుశెనగలు తిననివారితో పోల్చితే, ప్రతిరోజూ 4-5 వేరుశెనగలు తినేవారు హృదయ సంబంధ వ్యాధుల బారిన పడే అవకాశం తక్కువ అని తేలింది.
వేరుశెనగ ప్రయోజనాలు
- వేరుశెనగల్లో మంచి కొవ్వులు, పీచు పదార్థాలు, ప్రొటీన్, విటమిన్-ఈ, విటమిన్-బి, మినరల్స్, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెకు ఎంతో మేలు చేస్తాయి.
- సాధారణంగా దమనుల లోపల కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. ఈ చెడు కొలెస్ట్రాల్ అనేది ప్రధానంగా గుండె సమస్యలకు కారణమవుతుంది.
- ఈ సమస్యను నివారించాలంటే వివిధ రకాల గింజలను ఆహారంలో భాగంగా తీసుకోవాలి. ముఖ్యంగా వేరుశెనగలను, వేరుశెనగ నూనెలను ఆహారంగా తీసుకోవాలి. వీటిలోని ఫైబర్, ప్రొటీన్లు మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే వేరుశెనగల్లోని మోనోశాచురేటెడ్ కొవ్వులు.. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె సమస్యలు రాకుండా నివారిస్తాయి.
- కొన్నిసార్లు మీ ధమనుల లోపలి పొర అయిన ఎండోథెలియం దెబ్బతినవచ్చు. దీని వల్ల అథెరోస్కెలోరోసిస్ అనే ఆరోగ్య సమస్య ఏర్పడుతుంది. దీని నివారించాలంటే అర్జినైన్, ఫినోలిక్ రసాయనాలు అవసరం. అయితే ఈ రెండు యాంటీ ఆక్సిడెంట్లు కూడా వేరుశెనగల్లో పుష్కలంగా లభిస్తాయి. కనుక వేరుశెనగలను ప్రతిరోజూ తినడం వల్ల రక్తనాళాల్లో ఉన్న సమస్యలను సులువుగా నివారించుకోవచ్చు.
- వేరుశెనగలు ప్రతిరోజు తింటే, ఎండేథెలియల్ పనితీరు మెరుగుపడుతుంది.
- ఒక పరిశోధన ప్రకారం, అధిక బరువు ఉన్న మగవాళ్లు వేరుశెనగలు తింటే.. క్రమంగా బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది.
- వేరుశెనగలోని యాంటీ ఆక్సిడెంట్స్.. వాపులు సహా దీర్ఘకాలిక రుగ్మతల నుంచి రక్షణ కల్పిస్తాయి.
- వేరుశెనగలోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఆక్సీకరణ నష్టం, వాపు మరియు దీర్ఘకాలిక రుగ్మతల నుంచి రక్షణ కల్పిస్తాయి.
Beerakaya Health Benefits In Telugu : ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉందా?.. బీరకాయ తింటే చాలు!