మూత్రానికి వెళ్తావా? అని తల్లిదండ్రులు అడిగినప్పుడు.. అవసరం లేదని చెప్పిన పిల్లలే పది నిమిషాలు గడవక ముందే వెళ్తానని చెప్పవచ్చు. అలా చెప్పాక 5 లేదా 6 నిమిషాలు కూడా ఆగలేకపోవడం మూత్రకోశపు అతి చురుకుదనానికి(Overactive Bladder) నిదర్శనం. మూత్రానికి వెళ్లినా మూత్రకోశాన్ని పూర్తిగా ఖాళీ చేయలేకపోవడం, మూత్ర పిండాలలో సమస్య, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ లాంటి సమస్యలు చిన్నపిల్లల్లో ఈ పరిస్థితికి దారి తీస్తాయి.
పిల్లలు మామూలుగా మూడేళ్ల వరకు పక్క తడుపుతూ ఉంటారు. చాలా మంది మూడేళ్లు నిండగానే మూత్రాన్ని అదుపు చేసుకోవడానికి అలవాటు పడతారు. కొంతమందిలో ఐదారేళ్ల దాకా కూడా ఈ సమస్య కొనసాగవచ్చు. ఐదేళ్లకే 90 శాతం మంది పిల్లలకు మూత్రం మీద అదుపు వస్తుంది. అయితే.. పగటిపూట కూడా అదుపు కోల్పోవడమన్నది మూత్రకోశపు అతి చురుకుదనం అనే సమస్యకు కారణమని తెలుసుకోవాలి. తరచూ బాత్రూమ్కు వెళ్లాలనిపించడం దీని ప్రధాన లక్షణం.
రోజులో నాలుగు నుంచి ఐదుసార్లు మూత్రానికి వెళ్లడం సహజం. కానీ, మూత్రకోశం(Overactive Bladder Causes) నిండకపోయినా.. మూత్రానికి వెళ్లాలనిపించడం ఈ వ్యాధి లక్షణం. తరచూ మూత్రనాళానికి ఇన్ఫెక్షన్ సోకడం కూడా ఈ సమస్యకు కారణం. ఒక్కోసారి తుమ్మినప్పుడు అప్రయత్నంగానే నిక్కరు తడిసిపోవచ్చు. ఏడేళ్లు దాటిన తర్వాత కూడా పిల్లల్లో ఈ సమస్య ఉంటే వారు డాక్టర్ను సంప్రదించడం మేలు.
ప్రధానంగా బ్లాడర్ కెపాసిటీ కారణంగా మూత్రం ఆపుకోలేకపోవడం సమస్య ఎక్కువగా కనిపిస్తుందని ఓ నిపుణుడు తెలిపారు. వీటిని ఎదుర్కొనేందుకు డాక్టర్ను సంప్రదించి.. పలు టెస్టులు చేయుంచుకుంటే మంచిదని సూచించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: