ETV Bharat / sukhibhava

పొగ తాగడం చాలాసార్లు మానేసారా? - Tips To Quit Smoking

బ్రిటన్​లో 1984 నుంచి మార్చి నెలలో రెండో బుధవారాన్ని యాష్ వెన్స్ డే పాటిస్తోంది అక్కడి ప్రభుత్వం. పొగ తాగడం వల్ల కలిగే నష్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించటమే ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం.

Quit smoking
పొగ తాగడం చాలాసార్లు మానేసారా
author img

By

Published : Mar 10, 2021, 5:02 PM IST

Updated : Mar 11, 2021, 10:16 AM IST

"పొగ తాగటం ఎటువంటి రక్షణ లేకుండా వాహనం నడపటం లాంటిది. మద్యం తక్కువ మోతాదులో కొందరికి ఆరోగ్యాన్ని ప్రసాదించవచ్చు. కానీ పొగ తాగటంలో ఆ సౌలభ్యం లేదు” అని చేతన ఆసుపత్రి, హైదరాబాద్​లో పనిచేసే మానసిక వైద్యులు డా. ఫణి ప్రశాంత్ చెబుతున్నారు. ధూమపానం వల్ల కలిగే నష్టాలను "నో స్మోకింగ్​ డే" సందర్భంగా వివరిస్తున్నారు.

పొగ పెట్టే ధూమపానం:

సిగరెట్ పొగలో దాదాపు 4000 రకాల ప్రమాదకర రసాయనాలు ఉంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం వీటిలో సగం క్యాన్సర్​ను కలిగించవచ్చు లేదా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీయవచ్చు. ఏటా 80 లక్షల మంది వీటి వల్ల చనిపోతున్నారు. వీరిలో 10 లక్షల మంది పొగ తాగకపోయినా.. పొగ తాగేవారితో ఎక్కువ సమయం గడిపి వ్యాధుల బారిన పడుతున్నారు. పొగాకు వాడి తయారుచేసిన చుట్టలు, పొగరాని చుట్టలు, బీడీలు మొదలైనవి కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి.

ఆరోగ్యంపై ధూమపాన ప్రభావం:

పొగ తాగటం వ్యసనంగా మారి అనేక వ్యాధులకు కారణమవుతుంది. ఉన్న వ్యాధులను మరింత తీవ్రతరం చేస్తుంది. ఇది కలగజేసే ఉపద్రవాలు:

  • గుండెపోటు
  • కరోనరీ ధమని పూడుకుపోయి గుండె ఆగటం
  • దీర్ఘకాల శ్వాసకోస అవరోధం (సి.ఒ.పి.డి)
  • ఊపిరితిత్తుల క్యాన్సర్
  • గొంతు, ముక్కు, నోరు, మూత్రపిండాలు, రక్తం, క్లోమం, మూత్రాశయం మొదలైన భాగాల్లో క్యాన్సర్
  • రక్త నాళాల సమస్యలు
  • ఆమవాతం (రుమటాయిడ్ ఆర్థరైటిస్)
  • దృష్టి లోపం
  • ఆందోళన, చికాకు
  • ఆగని దగ్గు
  • లైంగిక సమస్యలు, వంధ్యత్వం
  • గర్భం ధరించటంలో సమస్యలు. గర్భం ధరించినా అబార్షన్ కావడం, ముందస్తు శిశు జననం లాంటి సమస్యలు, జన్మించిన శిశువులు అకాల మరణం పొందవచ్చు.

ఇవేకాక పొగ తాగటం వల్ల మధుమేహం తీవ్రమై, వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లి, చర్మం ముడతలు పడవచ్చు.

ధూమపానం మానడానికి చిట్కాలు:

పొగ మానడం అంత సులభం కాదు. అందుకే ధూమపానంలోని ప్రమాదాలను అర్థం చేసుకోవాలని డా. ఫణి ప్రశాంత్ చెబుతున్నారు. అందుకు కొన్ని చిట్కాలు:

  1. పూర్తిగా మానేయడానికి ప్రయత్నించండి. సాధ్యం కాకపోతే 6 సిగరెట్లు తాగేవారు 3, తరువాత 2, ఆపై 1 కి తగ్గించండి. రోజుకు 1 సిగరెట్ తాగేవారు రెండురోజులకు 1, ఆ తరువాత రెండు మూడు రోజులకొకటి ఇలా వ్యవధి పెంచుకుంటూ పూర్తిగా మానేయవచ్చు.
  2. పొగ తాగే స్నేహితులను కలవడం మానేయండి.
  3. ధూమపానం మానేసిన తరువాత దినచర్యలో మార్పులను తెచ్చి ఎక్కువ సమయాన్ని పనిలో గడపండి.
  4. స్నేహితులు, కుటుంబ సభ్యుల సహకారం పొందండి.
  5. మానసిక ఒత్తిడిని తగ్గించుకోడానికి యోగా, ధ్యానం, వ్యాయామం చేయాలి.
  6. నికోటిన్ రీప్లేస్ మెంట్ థెరపీ తీసుకోండి.
  7. ఇవేవీ సాధ్యం కాక అధిక సంఖ్యలో సిగరెట్లు కాలుస్తున్నట్లయితే మానసిక వైద్యున్ని సంప్రదించండి.

ధూమపానం మానడం సులభం కాకపోవచ్చు. కానీ అసాధ్యం కాదు. ఈ అలవాటు మానటం ద్వారా మీ ఆరోగ్యాన్నే కాకుండా మీ చుట్టుపక్కల వారి ఆరోగ్యాన్ని కాపాడిన వారవుతారు. మానడానికి ముహూర్తం అవసరం లేదు. ఎప్పుడైనా మానేయవచ్చు. అందుకే ఈ రోజే పొగ తాగటం మానండి.

ప్రస్తుతం ప్రపంచం కోవిడ్ గుప్పిట్లో విలవిల్లాడుతోంది. ధూమపాన ప్రియులు కొవిడ్ బారిన పడే అవకాశాలు హెచ్చుగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. సిగరెట్ ద్వారా, పీకల ద్వారా వైరస్ సులభంగా వ్యాప్తి చెందవచ్చు. హుక్కా తాగే వారిలోనూ పీక ద్వారా పలువురికి వైరస్ సోకవచ్చు. అందువల్ల పొగ తాగటం పూర్తిగా మానివేయటమే శ్రేయస్కరం.

Last Updated : Mar 11, 2021, 10:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.