ETV Bharat / sukhibhava

అంగం చిన్నగా ఉంటే ఇబ్బందా? తరచూ అలా చేస్తే నీరసపడిపోతారా? - does a guys size matter

సెక్స్​ చేయడానికి ముందు మగవారిలో చాలా అనుమానాలు, భయాలు ఉంటాయి. ముఖ్యంగా అంగం పరిమాణానికి సంబంధించి.. వారిలో ఆందోళన ఎక్కువగా ఉంటుంది. కొందరు వారి అంగం చిన్నదిగా ఉందని, అందువల్ల భాగస్వామిని తృప్తి పరచలేనేమో అని భావిస్తుంటారు. మరికొందరు పురుషాంగ పరిమాణం పెంచుకోవడానికి వివిధ ప్రయత్నాలు చేస్తుంటారు. నిజంగానే పురుషాంగం పరిమాణం పెంచుకోవచ్చా? అందుకు ఏం చేయాలి?

Etv Bharathow-much-of-penis-size-gives-sexual-pleasure
శృంగారంలో.. సుఖానికి, అంగం పరిమాణానికి​ ఏమైనా సంబంధం ఉందా
author img

By

Published : Jan 2, 2023, 2:58 PM IST

డాక్టర్ సమరం

మగవాళ్లలో కొంతమందికి అంగం చిన్నదిగా ఉండటం వల్ల వారు భార్యల ముందు అవమానంగా, సిగ్గుగా ఫీలవుతారు. అంగాన్ని పెద్దదిగా చేయడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటివారు శృంగారంలో పాల్గొనకుండా తప్పించుకుంటారు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? నిజంగా అంగం చిన్నగా ఉంటే భార్యను సుఖపెట్టలేరా? నిపుణుల సమాధానం ఏంటో తెలుసుకోండి.

ప్రశ్న: అంగం చిన్నదిగా ఉంటే రతిలో మహిళకు తృప్తి ఉండదా?
సమాధానం: అలా ఏమీ ఉండదు. అంగం చిన్నగా ఉన్నా, పెద్దగా రతిలో మహిళకు ఒకే రకమైన తృప్తి కలుగుతుంది. అంగం పెద్దగా ఉంటే ఎక్కువగా తృప్తి కలుగుతుందని చాలా మంది మగవారు పొరబడుతుంటారు. వాస్తవానికి మహిళకు సుఖాన్ని కలిగించే కామనాడులు రెండు, రెండున్నర అంగుళాలు మాత్రమే ఉంటాయి. అక్కడి వరకే అనుభూతి కలుగుతుంది. తర్వాత ఎలాంటి కామనాడులు ఉండవు. కాబట్టి పురుషాంగం ఎంత పొడవున్నా లోపల ఏమీ తెలియదు. పురుషాంగం నాలుగు అంగుళాలు ఉండి, సరిగ్గా చేయగలిగితే మహిళకు చెప్పలేనంత తృప్తి కలుగుతుంది.
ఒకవేళ.. 'నీ అంగం చిన్నదిగా ఉంది, నాకు తృప్తి కలగడం లేదు' అని ఎవరైనా మహిళ అంటే వారి మధ్య మానసిక అనుబంధం, ఆప్యాయత, అనురాగం లేదని అర్థం. అందుకు మానసిక పరమైన కారణాలే కానీ అంగం పరిమాణం ఏమాత్రం కాదు.

ప్రశ్న: పురుషాంగ పరిమాణం పెరుగుతుందా?
సమాధానం: పురుషాంగం పరిమాణం పెరగడం అనేది అసాధ్యం. అసలు జరగదు. స్తంభించిన పురుషాంగం ఉదాహరణకు 6 అంగుళాలు ఉంటే.. ఏం చేసినా అంతకుమించి పెరగదు. ఇంకా తగ్గుతుంది కానీ పెరగదు.

కొన్ని సర్జరీల్లో మాములుగా ఉన్న సమయంలో ఓ 3 అంగుళాల పురుషాంగాన్ని లాగి, బ్యాండు కట్టి పెద్దదిగా చేసి చూపిస్తారు. కానీ, అది స్తంభించినప్పుడు మళ్లీ 6 అంగుళాలే ఉంటుంది. ఎందుకంటే పురుషాంగం స్తంభించాలంటే ఎలాస్టిక్ టిష్యూస్ కావాలి. పురుషాంగం స్తంభించి లావుగా, పెద్దదిగా కావాలంటే రక్తపు గదులుండాలి. రక్తం నిండాలి. వాటి సంఖ్య మారదు. కాబట్టి పురుషాంగం పరిమాణం పెంచడానికి ఎలాంటి సర్జరీలు లేవు. ఉన్నాయని ఎవరైనా చెబితే అంతా మోసమే. ఎలాంటి తాయిలాలు పూసినా.. మసాజులు చేసినా ఏమీ జరగదు.

ప్రశ్న: పురుషాంగం పరిమాణం పెరగడానికి మసాజులు తోడ్పడుతాయా?
సమాధానం: అలా ఏమీ జరగదు. పురుషాంగం అనేది కండరం కాదు. అది కేవలం స్పాంజి టిష్యూ మాత్రమే. కండరాలకు మసాజ్​ చేస్తే బలంగా తయారవుతాయి.. కానీ ఎలాస్టిక్ టిష్యూ ఎప్పటికీ పెరగదు.

ప్రశ్న: హస్త ప్రయోగం అతిగా చేస్తే నీరసపడిపోతారా?
సమాధానం: అతిగా హస్తప్రయోగం చేస్తే పురుషులు నీరస పడిపోవడం వంటిదేం లేదు. హస్తప్రయోగంతో ఎలాంటి నష్టం జరగదు. వీర్యం ఎంత కోల్పోయినా.. తిరిగి తయారయ్యే శక్తి మానవ శరీరానికి ఉంది. శృంగారం ఎలాంటిదో హస్తప్రయోగం కూడా అలాంటిదే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.