ETV Bharat / sukhibhava

Heartburn VS Heart Attack : గ్యాస్ నొప్పికి, గుండెపోటుకి మధ్య తేడాలు ఏంటి? డాక్టర్లు ఏం అన్నారంటే.. - హార్ట్​ బర్న్​ వర్సెస్​ హార్ట్ ఎటాక్ తెలుగులో

Heartburn VS Heart Attack In Telugu : కొంతమందికి ఉన్నట్టుండి ఒక్కసారిగా ఛాతిలో చెప్పలేనంత బాధ వస్తుంటుంది. అయితే చాలామంది ఈ బాధని గ్యాస్ వల్ల వచ్చిందని అనుకుంటూ ఉంటారు. మరి గ్యాస్ వల్ల వచ్చే నొప్పికి, గుండెపోటుకి ఉన్న తేడాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Heartburn And Heart Attack Difference In Telugu
Heartburn And Heart Attack
author img

By

Published : Aug 8, 2023, 8:50 AM IST

Compare Heartburn And Heart Attack In Telugu : మారిన జీవన విధానం కావచ్చు లేదంటే ఇతర కారణాలు ఏవైనా కావచ్చు.. వీటి వల్ల మనలో చాలామందికి గ్యాస్, అజీర్తి, నొప్పి లాంటివి వస్తుంటాయి. అయితే కొన్నిసార్లు ఇది కాస్త ఎక్కువగా వస్తుంటుంది. కాగా దీనిని చాలామంది మామూలు నొప్పిగా భావించి, నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఇది కొన్నిసార్లు గుండెపోటుకి కూడా సంకేతం కావచ్చు. అయితే ఈ లక్షణాలు ఉంటే కచ్చితంగా గుండెపోటు అని కూడా చెప్పలేం. కాకపోతే తల నుంచి నడుము పైభాగం వరకు గుండెపోటుకు ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. అందులో ఛాతి మధ్యలో నొప్పి రావడం, కొంతమందికి తేన్పులు, మరికొందరికి ఆవలింతలు, చమటలు పట్టడం, భుజాలకు తలమీదుగా నొప్పి ఇలా రకరకాల సమస్యలు వస్తుంటాయని వైద్యులు అంటుంటారు. చాలామంది దీనిని గ్యాస్ వల్ల వచ్చే నొప్పి అని భావిస్తుంటారని.. కానీ అలాంటి పొరపాటు చేయవద్దని వైద్యులు సూచిస్తున్నారు. లక్షణాల తీవ్రతను డాక్టర్​కు వివరించి వెంటనే టెస్టులు చేయించుకోవాలని.. లేనిపక్షంలో గుండెపోటుకు ఆస్కారం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

కాఫీ, కూల్ డ్రింక్స్ తాగితే గుండెపోటు వస్తుందా..?
Does Coffee And Cool Drinks Cause Heart Attack : చాలామందికి కాఫీ లేదంటే కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకునే అలవాటు ఉంటుంది. అయితే ఈ అలవాటు ఉన్న వారికి గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందనే అపోహ కూడా ఉండవచ్చు. నిజానికి కాఫీ లేదంటే కూల్ డ్రింక్స్ తాగే వారికి గుండెపోటు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఎలాంటి అధ్యయనాలు లేవని వైద్యులు చెబుతున్నారు. కాకపోతే మితిమీరి తాగే కాఫీ లేదంటే కూల్ డ్రింక్స్ వల్ల అనారోగ్యం బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

గ్యాస్ నొప్పికి, గుండెపోటుకి మధ్య తేడాలు ఏంటి? డాక్టర్లు ఏం అంటున్నారంటే..

Heart Failure Symptoms And Causes : మానవ శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో గుండె ప్రధానమైంది. ఇది మన శరీరంలోని ప్రతి భాగానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఇదిలా ఉంటే కొన్నిసార్లు ఈ గుండె ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలానే ఉన్నాయి. మరి హార్ట్ ఫెయిల్యూర్​కు దారి తీసే కారణాలు ఏంటి, వీటి లక్షణాలు ఎలా ఉంటాయి, దీని నివారణకు పాటించాల్సిన జాగ్రత్తలు తెలుసుకోవాలంటే ఈ లింక్​పై క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.