Green Tea Vs Black Tea : మనలో టీ ప్రియులు చాలా మంది ఉంటారు. ప్రతి రోజూ కనీసం రెండు, మూడు కప్పుల టీ తాగకుండా అసలు ఉండలేరు. టీ తాగకపోతే పూట గడిచినట్లు అనిపించదు. టీలో చాలా వెరైటీలు ఉంటాయి. బాదం టీ, లెమన్ టీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ, అల్లం టీ, మసాలా టీ లాంటివి చాలానే ఉన్నాయి. ఎక్కువ మంది సాధారణ టీ, అల్లం టీ తాగుతూ ఉంటారు.
మరికొంత మంది మెరుగైన ఆరోగ్యం కోసం గ్రీన్ టీ, బ్లాక్ టీ లాంటివి తీసుకుంటారు. వాటిల్లో అధిక మోతాదులో ఉంటే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గ్రీన్ టీ, బ్లాక్ టీ మధ్య ఉన్న తేడా ఏంటి? ఏది తీసుకుంటే ఆరోగ్యానికి మరింత ప్రయోజనం చేకూరుస్తుంది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఆ మొక్క నుంచి బ్లాక్ టీ తయారీ
కామెల్లియా సినెన్సిస్ మొక్కల నుంచి గ్రీన్ టీ, బ్లాక్ టీ తయారుచేస్తారు. ఇతర టీల కంటే బ్లాక్ టీ ముదురు రంగులో, మంచి రుచిని కలిగి ఉంటుంది. నేడు బ్లాక్ టీ బ్యాగ్‌లు చాలా సులభంగా దొరుకుతున్నాయి. లేదా వీటిని విడిగా ఆకుల రూపంలోనూ కొనుగోలు చేయవచ్చు. పాలల్లో లేదా క్రీమ్‌తో కలిపి బ్లాక్ టీని తీసుకోవచ్చు.
కెఫిన్ ఎంత ఉంటుందంటే..?
Black tea caffeine content : బ్లాక్ టీ రకాన్ని అనుసరించి, దానిలోని కెఫిన్ శాతం అనేది మారుతూ ఉంటుంది. సాధారణంగా ఒక కప్పు బ్లాక్ టీలో 47 మిల్లీగ్రాముల కెఫిన్ వరకు ఉంటుంది. అదే ఒక కప్పు బ్రూకాఫీలో అయితే 91.8 మిల్లీగ్రాముల వరకు కెఫిన్ ఉంటుందని పలు పరిశోధనల్లో తేలింది.
బ్లాక్ టీ రకాలు
Different kinds of Black tea : బ్లాక్ టీలో ఎన్నో వెరైటీలు ఉన్నాయి. అసోం, డార్జిలింగ్, సిలోన్ రకాలతో పాటు.. ఎర్ల్ గ్రే, ఇంగ్లీష్ బ్రేక్‌ఫాస్ట్, ఛాయ్ లాంటి అనేక రకాల మిశ్రమాలు కూడా ఉంటాయి. ఉత్పత్తి అయ్యే ప్రాంతాలను అనుసరించి బ్లాక్ టీకి ఆయా పేర్లు వచ్చాయి. బ్లాక్ టీకి డిఫరెంట్ ఫ్లేవర్స్ అందించేందుకు వాటిల్లో కొన్ని రకాలైన నూనెలను కలుపుతారు. బ్లాక్ టీలో పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్లు, థెఫ్లావిన్స్, థెరూబిగిన్స్ లాంటి పదార్థాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని సెల్యూలార్ డ్యామేజ్ నుంచి కాపాడతాయి. అలాగే డిప్రెషన్, బ్రెస్ట్ క్యాన్సర్, టైప్ 2 డయాబెటిస్ లాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది.
డిప్రెషన్ సమస్య దూరం
Black Tea Benefits : బ్లాక్ టీలో పాలీఫెనాల్స్, అమైనో యాసిడ్ ఎల్ థియానిన్ మొదలైన సమ్మేళనాలు ఉంటాయి. కనుక రోజుకు ఒక కప్పు కంటే ఎక్కువ బ్లాక్ టీ తీసుకుంటే డిప్రెషన్‌కు గురయ్యే ప్రమాదం తక్కువగా ఉంటుందని పలు అధ్యయనాల్లో తేలింది.
కొలెస్ట్రాల్‌ను తగ్గించే మెడిసిన్
Black Tea Medicinal Uses : శరీరంలో అధిక కొలెస్ట్రాల్‌తో చాలామంది బాధపడుతూ ఉంటారు. అయితే బ్లాక్ టీ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవడానికి ఒక మందులా పనిచేస్తుంది. బ్లాక్ టీ తీసుకుంటే ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్, రక్తంలోని లిపిడ్ స్థాయిలు తగ్గుతాయి. అలాగే జీర్ణక్రియను మెరుపర్చడం ద్వారా శరీర బరువును తగ్గించుకోవడానికి కూడా సహాయపడుతుంది.
గ్రీన్ టీ, బ్లాక్ టీకి మధ్య తేడా ఏంటి?
Difference between Green Tea and Black Tea : బ్లాక్ టీతో పోల్చితే గ్రీన్ టీ తక్కువ రుచిని కలిగి ఉంటుంది. అలాగే బ్లాక్ టీతో పోలిస్తే గ్రీన్ టీలో కెఫిన్ తక్కువగా ఉంటుంది. గ్రీన్ టీలో కేవలం 29.4 మిల్లీగ్రాముల కెఫిన్ మాత్రమే ఉంటుంది. గ్రీన్ టీతో అనేక రోగ నిరోధక కారకాలు ఉంటాయి. ఇవి గుండెజబ్బు,లు, క్యాన్సర్లు, అధిక రక్తపోటు సమస్యలు రాకుండా రక్షిస్తాయి.
ఒత్తిడిని తగ్గించే గుణాలు
Green Tea Medicinal Uses : బ్లాక్ టీ తరహాలోనే గ్రీన్ టీలో కూడా ఒత్తిడిని తగ్గించే గుణాలు ఉంటాయి. తరచూ గ్రీన్ టీ తీసుకోవడం వల్ల ఒత్తిడికి గురయ్యే ప్రమాదం 34 శాతం వరకు తగ్గుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. అలాగే బరువు తగ్గడానికి కూడా గ్రీన్ టీ ఉపయోగపడుతుంది. వాస్తవానికి బ్లాక్ టీలో ఎక్కువ కెఫిన్ ఉంటుంది. అందుకే బ్లాక్ టీతో పోలిస్తే గ్రీన్ టీ మరింత మంచిది.