ETV Bharat / sukhibhava

Thalassemia disease facts : ఆ 4 జిల్లాల్లో తలసేమియా తీవ్రత ఎక్కువ

Thalassemia disease facts : జన్యుపరమైన లోపం చిన్నారులకు శాపంగా మారుతోంది. ఆడిపాడే బాల్యాన్ని బలి తీసుకుంటోంది. తల్లిదండ్రులకు శోకం మిగుల్చుతోంది. తలసేమియా గురించే ఇదంతా. రాష్ట్రంలో ఈ వ్యాధి ప్రభావం ఎంత అనేదానిపై నిపుణుల మాటేంటి?

Thalassemia disease facts , doctor vr rao interview
రాష్ట్రంలో ఆ 4 జిల్లాల్లో తలసేమియా తీవ్రత ఎక్కువ
author img

By

Published : Feb 8, 2022, 1:40 PM IST

రాష్ట్రంలో ఆ 4 జిల్లాల్లో తలసేమియా తీవ్రత ఎక్కువ

Thalassemia disease facts : దేశ వ్యాప్తంగా తలసేమియా బాధితుల సంఖ్య ఏటికేడు లెక్కకు మిక్కిలిగా పెరుగుతోంది. బిడ్డల ప్రాణాలు కాపాడుకునేందుకు వేలకు వేలు పోస్తూ.. పోరాటం చేస్తున్న వాళ్లూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే.. హైదరాబాద్‌లోని తలసేమియా సొసైటీ.. జీనోమ్ ఫౌండేషన్‌ సంయుక్తంగా ఓ అధ్యయనం చేపట్టాయి. తెలంగాణలోని 4 జిల్లాల్లో తలసేమియా వ్యాప్తి ఎక్కువగా ఉందని నిర్ధరించాయి. మరికొన్ని రాష్ట్రాల్లోనూ సమస్య తీవ్రంగానే ఉందని అంటున్నారు.. జీనోమ్ ఫౌండేషన్ సీనియర్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ డాక్టర్ వీఆర్ రావు. తలసేమియాపై ఎలా అధ్యయనం సాగించారు..? ఏయే ప్రాంతాల్లో తీవ్రత గుర్తించారు..? అన్న అంశాలను ప్రత్యేక ముఖాముఖిలో పంచుకున్నారు.. డాక్టర్ వీఆర్ రావు.

Thalassemia disease : 'బీటా తలసేమియా ఉనికి ప్రపంచవ్యాప్తంగా ఉంది. భారత్‌లో పలు వర్గాల్లో ప్రమాదకర స్థాయిలో ఉంది. ఐసీఎమ్‌ఆర్‌ టాస్క్‌ఫోర్స్‌ నమూనాలు సేకరించింది. దేశవ్యాప్తంగా 6 లక్షల మందిని పరిశీలించింది. 2-5% మేర తలసేమియా ఉన్నట్టు తేలింది. టాస్క్‌ఫోర్స్‌ టెస్టింగ్ పరిధిలో తెలంగాణ లేదు. జన్యువుల్లో మ్యుటేషన్ల వల్లే తలసేమియా వస్తుంది. తలసేమియాలో మైనర్లే క్యారియర్లుగా మారతారు. తెలంగాణలో 31 జిల్లాల్లోని 312 మందిని పరిశీలించాం. తెలంగాణలో 4 జిల్లాల్లో తలసేమియా తీవ్రత బాగా ఉంది. మహబూబ్‌నగర్‌లో 33 మేజర్ కేసులు గుర్తించాం. రంగారెడ్డి, సంగారెడ్డి, ఖమ్మంలోనూ తలసేమియా ఉంది. మొత్తం 48 సామాజిక వర్గాల్లో వ్యాప్తి చెందుతోంది.'

-డాక్టర్ వీఆర్ రావు

Thalassemia News : 'మిగతా రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితులు ఉండొచ్చు. లోతైన అధ్యయనం చేస్తే తీవ్రత కచ్చితంగా తెలుస్తుంది. జన్యువుల్లో మ్యుటేషన్‌ ఎలా జరుగుతోందనేదే కీలకం. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధిపై అనేక పరిశోధనలున్నాయి. మలేరియా ఎక్కడుందో అక్కడ తలసేమియా ఎక్కువ. గుజరాత్, బెంగాల్‌లోనూ తీవ్రత ఎక్కువగానే ఉంది. మలేరియాకు అనుబంధంగా వచ్చే వ్యాధి ఇది. ఉష్ణమండల ప్రాంతాల్లోనే సమస్య తీవ్రంగా ఉంది. తలసేమియా ఎక్కువ ఉన్న చోట సికిల్ సెల్ తక్కువే. గిరిజన ప్రాంతాల్లో సికిల్ సెల్ సమస్య ఎక్కువగా ఉంది. ఇలా ప్రాంతాన్ని బట్టి తీవ్రత మారుతూ ఉంటుంది. మహబూబ్‌నగర్‌లో క్యారియర్ స్క్రీనింగ్ చేయాలి.'

-డాక్టర్ వీఆర్ రావు

ఇదీ చదవండి : Teen Pregnancy: ఈ విషయాలు మీకు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.