పురుషులు, మహిళలు ఒకేలాంటి ఆహారాన్ని తీసుకున్నా.. ఒకే లాంటి పనులు చేసినా.. మహిళలతో పోలిస్తే పురుషుల్లో అధిక కేలరీలు ఖర్చవుతుంటాయి. సాధారణంగా మహిళలకు రోజుకు 1200 కేలరీలు అవసరమవుతాయి. కానీ, పురుషులకు అంతకుమించి అవసరం ఉంటుంది. మగవారిలో అధిక ప్రొటీన్ అవసరం అందుకోసం మాంసాహారం ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా రెడ్‌మీట్, చేపలు, సముద్రపు ఆహారం తీసుకోవడం అవసరం.
- రెడ్‌మీట్‌లో ల్యూసిన్ ఎమినో యాసిడ్స్ కండరాలు ధృఢంగా ఉండేందుకు సహాయపడతాయి.
- పురుషులకు మాంసాహారంతో పాటు శాకాహారం కూడా ముఖ్యమే! సరిగ్గా చెప్పాలంటే అన్ని రకాల పోషకాల కోసం కూరగాయలే మేలు. వీటి వల్ల కణాల ఆరోగ్యం బాగుంటుంది.
- ఇందుకోసం అన్ని రంగులు ఉన్న కూరగాయలను తీసుకోవాలి. ఆకు కూరల నుంచి లభించే ల్యూటిన్, జక్సాన్కిన్ వల్ల ప్రొస్టేట్ గ్రంధికి వచ్చే అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.
- కాషాయ రంగుల్లో ఉండే కూరగాయల్లో బీటా కెరోటిన్, మ్యూటిన్, విటమిన్ సీ ఎక్కువగా ఉంటాయి. ఇవి కూడా ప్రొస్టేట్ గ్రంధి క్యాన్సర్ రాకుండా కాపాడతాయి.
- టమోటాలను తినడం వల్ల మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే అనేక ప్రయోజనాలున్నాయి. తక్కువ కేలరీలు ఉన్న టమోటాలు.. చర్మం, కళ్లకు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే విటమిన్ ఏ, సీ రోగనిరోధక శక్తిని పెంపొందించి వ్యాధుల నుంచి రక్షణ ఇస్తాయి.
- పురుషుల్లో కండపుష్టికి ఉడికించిన గుడ్డు చాలా అవసరం. రోజూ ఒక గుడ్డు తినాలని న్యూట్రిషన్స్ సూచిస్తున్నారు. దీని వల్ల శరీరానికి కావాల్సిన ప్రొటీన్ లభిస్తుంది. కాబట్టి పురుషుల ఆరోగ్యానికి గుడ్డు చాలా ముఖ్యం.
- పీచు పదార్థం కోసం బ్రౌన్ రైస్, ఓట్స్, తృణ ధాన్యాలు తీసుకోవాలి. వీటిలో విటమిన్ బీ పుష్కలంగా ఉంటుంది. టైప్ 2 డయాబెటిస్ రాకుండా తృణధాన్యాలు రక్షిస్తాయి.
- ఆరోగ్యకరమైన ఆహారాలతో పాటు పాలు, పాల ఉత్పత్తులు సమృద్ధిగా తీసుకుంటే పురుషులకు మంచి కాల్షియం అందుతుంది. వీటితో పాటు కాలానుగుణంగా దొరికే పండ్లను రోజువారి డైట్లో చేర్చుకుంటే మంచిది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి.. Healthy Food: చెడు కొలెస్ట్రాల్ తగ్గాలా?.. రోజూ వీటిని తినండి!