ETV Bharat / sukhibhava

ఈ ఆహారం తీసుకుంటే మీ చర్మం నిగనిగలాడాల్సిందే! - మెరిసే చర్మం

Foods for Healthy Skin: చర్మం అందంగా మెరుస్తూ ఉండాలని అందరూ కోరుకుంటారు. అందుకే చాలా మంది ఎన్నో రకాల పద్ధతులను అనుసరిస్తూ ఉంటారు. అయితే చర్మసౌందర్యం పెంచుకోవాలంటే మంచి ఆహారం తీసుకోవాలంటున్నారు నిపుణులు. మరి మెరిసే చర్మం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి? దీనిపై నిపుణులు ఏం చెప్తున్నారంటే..

health
health
author img

By

Published : Apr 25, 2022, 8:54 AM IST

Foods for Healthy Skin: చర్మం అందాన్ని పెంచే సౌందర్య సాధనాలు మార్కెట్లో ఎన్నో దొరుకుతున్నా.. పైపూతలు రాస్తే సరిపోదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మనం తినే ఆహారంపైన కూడా శ్రద్ధ పెట్టాలని సూచిస్తున్నారు. శరీరంలోకి వెళ్లే ఆహార ప్రభావం మన చర్మంపైన కనపడుతుందంటున్నారు. మరి చర్మాన్ని మెరిపించే ఆహారాలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • ఆరోగ్యకరమైన ఆహారాలు అన్నీ చర్మానికి మేలు చేసేవే అయినా.. ప్రత్యేకంగా కొన్నింటి గురించి చెప్పుకోవాలి. వాటిలో అవిసే గింజలు ఒకటి. వీటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్.. సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రా వయలట్​ కిరణాల వల్ల చర్మానికి హాని కలగకుండా ఆపుతాయి.
  • చియా గింజలు, గుమ్మడి విత్తనాలు, సాల్మన్, ట్యూనా, సార్డిన్, చేపలు వంటి చేపల్లో సైతం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్​ ఎక్కువగా ఉంటాయి.
  • బాదం, వేరుసెనగల్లో ఉండే విటమిన్​-ఇ సైతం చర్మానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్స్​గా ఉపకరిస్తుంది. వయసు పెరగడం వల్ల చర్మానికి కలిగే హానిని ఈ యాంటీ ఆక్సిడెంట్స్​ తగ్గిస్తాయి.

"సాధారణంగా చాలా మంది బ్యూటీపార్లర్లు, చిట్కాలు పాటిస్తుంటారు. కానీ చర్మం ఆరోగ్యం అనేది మనం తీసుకునే ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ కాన్​స్టిపేషన్​ ప్రాబమ్ కనుక ఉంది అంటే చర్మంలో చాలా మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ఒంట్లో వేడి చేయడం వల్లే చర్మ సమస్యలు వస్తాయనేది అపోహ. ఈ కాన్​స్టిపేషన్​ సమస్యకు చెక్​ పెట్టాలంటే పీచు పదార్థాలు ఎక్కువ ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. దీంతో పాటు తగినంత నీరు తాగాలి." అని నిపుణులు సూచిస్తున్నారు.

  • కివీ పండ్లు కూడా చర్మానికి ఆరోగ్యాన్ని మెరుపును ఇస్తాయి. వీటిలో సీ విటమిన్​ ఎక్కువగా ఉంటుంది. సీ విటమిన్​తో అల్ట్రావయోలెట్​ కిరణాల నుంచి రక్షణ కలుగుతుందని అధ్యయనాలు చెప్తున్నాయి. నిమ్మ, ఆరెంజ్, ఆకుపచ్చని ఆకుకూరలు కూరగాయలు, టమాటలో ఎక్కువగా ఈ విటమిన్​ సీ లభిస్తుంది.
  • అవకాడోలో కూడా చర్మానికి మేలు చేసే విటమిన్​ ఈ, సీలు పుష్కలంగా లభిస్తాయి.
  • పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా లేదా ప్రోబయోటిక్స్​ కూడా చర్మానికి మేలు చేసేవే.
  • సీజనల్​ ఫుడ్స్​కు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా చర్మ సమస్యలకు చెక్​ పెట్టొచ్చు అంటున్నారు నిపుణులు.
  • గ్రీ టీలో ఉండే పొలిఫెనాల్స్​ అనే యాంటీఆక్సిడెంట్స్​ సైతం చర్మానికి మేలు చేస్తాయి. ఆలివ్​ ఆయిల్​లో శరీరంలోని మంట, వాపు లక్షణాలను తగ్గించే గుణం ఉంది.
  • క్యారట్​లో ఉండే బిటాకిరోటిన్​ సూర్యడి నుంచి వచ్చే హానికరమైన కిరణాల నుంచి కాపాడుతుంది. క్యారెట్​లో ఉండే మెగ్నీషియం నిద్ర బాగా పట్టేందుకు దోహదం చేస్తుంది. నిద్ర బాగా పట్టినా చర్మానికి మేలు కలుగుతుంది.

రెడీమేడ్​గా దొరికే ఆహారాలు, జంక్​ ఫుడ్లు వంటివి తగ్గించడం వలన చర్మానికే కాకుండా పూర్తి ఆరోగ్యానికి సైతం మేలు కలుగుతుందంటున్నారు నిపుణులు. అలాగే మంచి నిద్ర, వ్యాయామం ఒత్తిడి లేకుండా జీవించడం కూడా చర్మానికి మెరుపును ఆరోగ్యాన్ని ఇస్తాయని చెప్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి : జుట్టును పెంచే గింజలు... మీరు ట్రై చేస్తారా?!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.