ETV Bharat / sukhibhava

చనుబాల నాణ్యత పెంచే ఆయుర్వేదం!

తల్లులు ఎలాంటి ఆహారం తీసుకోవాలో మన అమ్మమ్మలు, అమ్మలు చెబుతూనే ఉంటారు. తల్లి తీసుకునే ఆహారమే శిశువు ఎదుగుదలను నిర్దేశిస్తుంది. మరి ఆ సమయంలో చనుబాల నాణ్యత, ఉత్పత్తి పెంచుకోవడానికి అమ్మలు ఎలాంటి ఆహారం తీసుకోవాలో వైద్యుల మాటల్లోనే తెలుసుకుందాం రండి...

Diet For Breastfeeding Mothers
చనుబాల నాణ్యత పెంతే ఆయుర్వేదం!
author img

By

Published : Sep 7, 2020, 11:40 AM IST

గర్భం దాల్చినప్పటి నుంచి తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెడితేనే శిశువు ఆరోగ్యంగా ఉంటుంది. ఇక శిశువు పుట్టాక, తాను తీసుకునే తొలి ఆహారం తల్లిపాలు ఎంత స్వచ్ఛమైతే అంత ఆరోగ్యం అందుతుంది. మరి పాలిచ్చే అమ్మలు ఏం తినాలనే విషయంపై మన ఆయుర్వేద ప్రొఫెసర్, డా. రాజ్యలక్ష్మీ మాధవం ఏం చెబుతున్నారో చూసేయండి..

నీళ్లు తాగేయండి...

పాలిచ్చే తల్లులు రోజులో ఎంత ఎక్కువ నీరు తాగితే అంత సాఫీగా పాల ఉత్పత్తి ఉంటుంది. ఒకేసారి ఎక్కువ నీరు కాకుండా కొద్దికొద్దిగా తాగుతూ.. కనీసం 4 లీటర్ల నీళ్లు తాగితే మంచిది.

కొబ్బరితో ప్రయోజనాలు

కొబ్బరి పాలు, కొబ్బరి నీళ్లు పాల ఉత్పత్తిని పెంచుతుంది. బిడ్డకు పోషకాలు పుష్కలంగా అందేలా చేస్తుంది.

చనుబాలకు పాలు

పాలలో ఉండే లాక్టోస్ శరీరంలో లాక్టిక్ హార్మోన్లను వృద్ధి చేస్తుంది. ఫలితంగా చనుబాల ఉత్పత్తి, నాణ్యత పెరుగుతాయి.

గోధుమలు మంచివే

గోధుమ రవ్వ, చపాతీ వంటివి తీసుకోవడం వల్ల తల్లి పాలల్లో మంచి కొవ్వు చేరుతుంది. బిడ్డకు పోషకాలు అందుతాయి.

Diet For Breastfeeding Mothers
మసాలా మంచిదే

మసాలా.. తినాలా..

నల్ల మిరియాలు, జీలకర్ర, దాల్చినచెక్క, కరోమ్ విత్తనాలు మొదలైన సుగంధ ద్రవ్యాలు రోజు ఆహారంలో చేర్చుకోవాలి. అయితే, ఎర్ర కారం, పచ్చిమిర్చిని కూడా నివారిస్తే ఇంకా మంచిది.

అల్లంతో ఆరోగ్యం

అల్లం రోగనిరోధక శక్తిని పెంచడమే కాక, యాంటి ఫంగల్, యాంటి బాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. కాబట్టి రోజూ అల్లం తింటే చనుబాలు మరింత ఆరోగ్యకరంగా ఉంటాయి.

మెంతులతో మేలు

మెంతుల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి శిశువు మెదడు అభివృద్ధికి తోడ్పడుతాయి. దీన్ని రోజువారీ ఆహారంలో తీసుకోవచ్చు.. లేదా కొన్ని మెంతులను నీటిలో రాత్రి నానబెట్టి ఉదయాన్నే తీసుకోవచ్చు.

సోంపు గింజలు

సోంపు తల్లి పాల ఉత్పత్తిని పెంచుతుంది. జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. వీటిని అమాంతం తినేయొచ్చు లేదా 100 మి.లీ పాలలో అర చెంచా సోంపు పౌడర్ కలిపి తీసుకోవచ్చు.

పండ్లు

భారతదేశంలో పండించిన పండ్లు తీసుకుంటేనే మన శరీర తత్వానికి సరిపోతాయి. పాలిచ్చే తల్లి సీజనల్ పండ్లు తింటే బిడ్డలకు ఆరోగ్యం అందుతుంది. దానిమ్మ రక్తాన్ని శుద్ధి చేస్తుంది, తల్లిలో పాల ఉత్పత్తిని పెంచుతుంది కాబట్టి దానిమ్మ తప్పకుండా రోజూ తినాల్సిన పండు.

నువ్వులు

నువ్వుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది, ఇది ఎముకల ఆరోగ్యానికి కారణమవుతుంది. అందువల్ల, నువ్వుల వినియోగం తల్లి , బిడ్డల ఎముకలను దృఢంగా చేస్తుంది.

Diet For Breastfeeding Mothers
పోషకాలు తినాలి

డ్రైప్రూట్స్

జీడిపప్పు, బాదం, వాల్‌నట్ మొదలైన గింజలను పాలిచ్చే తల్లి తినవచ్చు. బాదంపప్పును రాత్రిపూట నానబెట్టి ఉదయన్నే తింటే ఫలితం ఎక్కువగా ఉంటుంది.

ఏవి తినొద్దు..?

  • చాలా కారంగా, ఘాటుగా ఉండే ఆహారం
  • వేడి ఆహారాలు
  • బ్రెడ్
  • బర్గర్స్ / పిజ్జాలు
  • ఆల్కహాల్
  • ధూమపానం
  • పొగాకు
  • కాఫీ / కెఫిన్ ఉత్పత్తులు

తల్లి పాలు ఉత్పత్తికి ఆటంకం కలిగించే ఏ పదార్థాలైను తల్లి త్యజించాల్సి ఉంటుంది. అలాగే, మానసిక ఒత్తిడి ఉండకూడదు. తల్లి ఆరోగ్యకరమైన, సంతోషకరమైన వాతావరణంలో జీవించాలి. అమ్మ ఆరోగ్యంగా ఉంటేనే కదా బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుంది. అందుకే గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డ చనుబాలు మానేసేదాకా తల్లి ఆహారం, జీవనశైలిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం.

ఇదీ చదవండి: జంక్​ ఫుడ్​ను కాస్త చూసి తినండి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.