ETV Bharat / sukhibhava

మెట్లు ఎక్కడం వల్ల మీలో ఆ సామర్థ్యం పెరుగుతుంది!

నడక నాలుగు విధాలా మంచిది. ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం. కానీ రోజువారీ జీవితంలో మనం ఎక్కే మెట్లు మనకు అంతకు మించిన మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు. అది ఎలానో ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

climbing stairs
మెట్లు ఎక్కడం
author img

By

Published : Jul 31, 2021, 7:24 PM IST

శరీరానికి వ్యాయామం చాలా అవసరం. సగటు మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే శరీరానికి తప్పనిసరిగా వ్యాయామం అనేది కావాలి. అయితే చాలామంది దీని కోసం చాలా కష్టపడుతుంటారు. ఇంట్లో ఉండే వృద్ధులు వయసురీత్యా వ్యాయామం చేయడానికి కష్టపడుతుంటారు. దీనికి కారణాలు లేకపోలేదు. శారీరక మార్పులు, సరిగా బలం లేకపోవడం, ఓర్పు నశించడం లాంటి వాటి వల్ల వారు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు.

నిజానికి సాధారణ శారీరక శ్రమ కూడా వృద్ధుల ఆరోగ్యాన్ని మెరుగు పరిచేలా చేస్తుందని పరిశోధనల్లో తెలింది. ప్రధానంగా ఇంట్లో ఉండే మెట్లు ఎక్కడం వల్ల వారు స్వతంత్రంగా జీవించగలరని.. అంతేగాక మెరుగైన జీవన శైలికి సహాయపడుతుందని పబ్‌మెడ్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం పేర్కొంది. రోజువారీ జీవితంలో శారీరక శ్రమను పెంచడానికి మెట్లు ఎక్కడం అనేది మంచిదని స్పష్టం చేసింది.

మెట్లు ఎక్కడం ఎందుకు ఉత్తమం?

చాలామంది నడకకే ప్రాధాన్యం ఇస్తారు. ఉదయాన్నే లేచి పార్క్​కి లేదా గ్రౌండ్​కు వెళ్లి వాకింగ్​ చేస్తారు. కానీ ఇంట్లో ఉండే మెట్లు ఎక్కి దిగడం వల్ల వాకింగ్ చేసిందానికంటే ఎక్కువ క్యాలరీలు ఖర్చు అవుతాయి. ఓసారి నడిచిన దాని కంటే స్టెప్స్​ ఎక్కడం వల్ల 8 నుంచి 10 రెట్ల శక్తి ఖర్చు అవుతుంది. అందులోనూ ఇది వ్యాయామం చేసినట్లు కూడా అనిపించదు. మనం నడుస్తున్నప్పుడు లేదా పరుగెత్తినప్పుడు మన శరీరం క్షితిజ సమాంతరంగా కదులుతుంది. ఈ క్రమంలో కొద్దిగా కదలికలను మనం గమనించగలుగుతాం. అదే మెట్లు ఎక్కేటప్పుడు అయితే కాలికి ఉండే కండరాలు నిలువుగా కదలాడుతుంటాయి. దీనికి తోడు భూమి గురుత్వాకర్షణ శక్తి శరీరం మీద ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎక్కువ క్యాలరీల శక్తి ఖర్చు అవుతుంది.

ఉపయోగాలు ఏంటి?

  • మెట్లు ఎక్కడం అనేది ఇంట్లోనే చేస్తాం కాబట్టి ప్రత్యేక స్థలం అవసరం లేదు.
  • మెట్లు ఎక్కడానికి ప్రత్యేక వ్యాయామ దుస్తులు అవసరం లేదు.
  • స్పోర్ట్స్ సామాగ్రి అవసరం ఉండదు.
  • ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా చేయవచ్చు.
  • లిఫ్ట్​కు బదులు మెట్లు ఎక్కడం ఉపయోగిస్తే దీనినే కొనసాగిస్తారు.
  • నడవడం కంటే మెట్లు ఎక్కడం వల్ల రెట్టింపు కొవ్వు కరుగుతుంది.
  • 15 నిమిషాల పాటు మెట్లు ఎక్కిదిగడం వల్ల 250 క్యాలరీల శక్తి ఖర్చు అవుతుంది.
  • మెట్లు ఎక్కే తీవ్రతను బట్టి ఏరోబిక్​ ప్రయోజనం కూడా ఉంటుంది.
  • రన్నింగ్​ కంటే కూడా కొంచెం ఎక్కువ ప్రయోజనాలు మెట్లు ఎక్కడం వల్ల ఉంటాయి.
  • మెట్లు ఎక్కడంలో వేగం పెరిగితే అదే స్థాయిలో ప్రయోజనాలు కూడా పెరుగుతాయి.
  • మెట్లు ఎక్కడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
  • కండరాలు మరింత బలిష్ఠంగా తయారు అవుతాయి.
  • ఒకే సమయంలో రెండు మెట్లు ఎక్కగలిగితే ఎక్కువ క్యాలరీలు బర్న్​ అవుతాయి.
  • రెండు మెట్లు ఎక్కడం వల్ల కాలి కండరాలు, పిరుదుల మీదే ఒత్తిడ పడి గట్టిపడుతాయి.
  • పది మెట్లు ఎక్కడం అనేది 38 అడుగులతో సమానం అని నిపుణులు చెప్తున్నారు.

ఇదీ చూడండి: రోజువారీ వ్యాయామం మానేస్తున్నారా? అయితే జాగ్రత్త.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.