ETV Bharat / sukhibhava

టాటూ.. వేసుకుంటున్నారా? కాస్త జాగ్రత్త గురూ! - పచ్చబొట్టు జాగ్రత్తలు

యువతలో టాటూకి ఉన్న క్రేజే వేరు..! చాలా మంది సినీతారలు, క్రీడాకారులపై ఉన్న మక్కువతో వాళ్ల పేర్లు టాటూ వేయించుకుంటారు. అయితే పచ్చబొట్టు వేయించుకునే ముందు జాగ్రత్తలు మాత్రం తీసుకోరు. పదికాలాల పాటు పచ్చబొట్టు నిలవాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి.

Tattoo
పచ్చబొట్టు
author img

By

Published : Jan 4, 2021, 10:58 AM IST

Updated : Jan 4, 2021, 11:45 AM IST

మనసులోని భావాలకు ఓ రూపం రావాలంటే టాటూ...

ఇష్టసఖులపై ప్రేమ చాటి చెప్పాలంటే టాటూనే...

ఆవేశం, అభిమానం.. ప్యాషన్‌.. అన్నింటికీ పచ్చబొట్టే యువతకు ఓ భావ వ్యక్తీకరణ మార్గం.

అంతలా కుర్రకారు మేనిని పెనవేసుకునే టాటూ కలకాలం నిలవాలన్నా.. కలత పెట్టే మరకగా మారకుండా ఉండాలన్నా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే.

ఆల్కహాల్‌ అసలే వద్ద్దు

హ్యాంగోవర్‌లో ఉన్నప్పుడు, మద్యపానం సేవించినప్పుడు రక్తం త్వరగా పలచబడుతుంది. ఈ సమయంలో టాటూ వేసుకుంటే చర్మంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. మనం వేసుకునే డిజైన్, మేనిపై ఇచ్చే చోటును బట్టి ఈ ప్రతికూలత ఎక్కువగా ఉండొచ్చు. టాటూ వేయించుకున్న చోట గాయాలైతే త్వరగా మానవు. అందుకే.. పచ్చబొట్టు వేయించుకునే 24 గంటల ముందు ఆల్కహాల్‌ తాగొద్దు. పెయిన్‌ కిల్లర్లు వాడొద్దు.

కడుపు నిండుగా

Tattoo
విరాట్​ కోహ్లీ

ఖాళీ కడుపుతో టాటూ వేయించుకోవడం అసలు మంచిది కాదు అంటారు వైద్యులు. ఆరోగ్యపరంగా దుష్ప్రభావాలు ఎదురవుతాయి. ఈ సమయంలో కడుపు నిండుగా కాకపోయినా కనీసం అల్పాహారమైనా భుజించాలి.

మనకేం కావాలో..

Tattoo
సమంత

పచ్చబొట్టు ఒక్కసారి వేస్తే చెరిపేయడం చాలా కష్టం. స్పెల్లింగ్, గ్రామర్‌ తప్పుల్లేకుండా ముందే చూసుకోవాలి. మనకెలాంటి డిజైన్‌ కావాలో ముందే తేల్చుకోవాలి. టాటూ ఆర్టిస్టుల గురించి ఆరా తీయాలి. ఇంతకుముందు వాళ్ల పనితనం, నైపుణ్యం గురించి తెలుసుకోవాలి.

రక్షణ ముఖ్యం

Tattoo
హార్దిక్​ పాండ్యా

పచ్చబొట్టు పొడిపించుకోవడం ఓ సుదీర్ఘ ప్రక్రియ. వారం రోజుల ముందే జాగ్రత్తలు మొదలవ్వాలి. చర్మం మృదువుగా, దృఢంగా తయారు కావడానికి కొద్దిరోజులు ముందు నుంచే మాయిశ్చరైజ్‌ చేయాలి. ఆ ప్రాంతంలో వెంట్రుకలు ఉంటే తొలగించాలి. సన్‌స్క్రీన్‌ లోషన్‌ వాడుతుండాలి. ఇవన్నీ తప్పనిసరిగా చేస్తేనే టాటూ తర్వాత కలిగే బాధ నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది. తర్వాత ఎలాంటి ఉత్పత్తులు వాడాలో, ఏవి వాడకూడదో టాటూ ఆర్టిస్టుని అడిగి తెలుసుకోవాలి.

అక్కడైతే వద్దు

పచ్చబొట్టు పదికాలాలు నిలిచి ఉండాలన్నా, ఆకట్టుకునేలా కనిపించాలనుకున్నా అది వేయించుకునే ప్రాంతం ముఖ్యం. అరచేతులు, వేళ్లలో అస్సలు వేయించుకోవద్దు. ఇక్కడైతే టాటూ ఎక్కువ కాలం నిలిచి ఉండదు. ఎముకలున్న చోట అయితే నొప్పి అధికంగా ఉంటుంది. నాభి, కండరాల్లాంటి విశాలమైన ప్రదేశాలు, కండపుష్టి ఉన్నచోట అయితే పచ్చబొట్టు అందంగా కనిపిస్తుంది. అధికకాలం నిలిచి ఉంటుంది.

Last Updated : Jan 4, 2021, 11:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.