ETV Bharat / sukhibhava

ఎన్‌ 95 మాస్కులను ఉతకొచ్చా?

ఒక ఎన్‌95 మాస్కును ఎన్ని రోజులు, ఎన్ని గంటలు వాడుకోవాలి? కొందరు ఒక మాస్కునే ఉతికి మళ్లీ మళ్లీ వాడుతున్నారు. ఇది మంచిదేనా?

author img

By

Published : May 19, 2021, 12:24 PM IST

N 95
మాస్కు

కరోనా వైరస్​ను అడ్డుకోవడంలో ఎన్‌95 మాస్కులు సమర్థంగా పనిచేస్తాయని వైద్యులు, నిపుణులు చెబుతున్నారు. అయితే ఆ మాస్కులను ఎలా వాడాలి? ఎన్ని రోజులు వినియోగించవచ్చు? ఇలాంటి ఈ ప్రశ్నలకు ప్రముఖ పల్మనాలజిస్ట్​ డాక్టర్​ శుభాకర్ చెప్పిన సమాధానాలు ఆయన మాటల్లోనే..

శుభ్రం చేసే పద్ధతులు వేరే

ఎన్‌95 మాస్కులు కొవిడ్‌-19 కారక వైరస్‌ను సమర్థంగా అడ్డుకునే మాట నిజమే వీటిని ఉతికి, తిరిగి వాడుకోవటం తగదు. సబ్బుతో, నీటితో, వైద్య అవసరాలకు ఉపయోగించే ఆల్కహాల్‌తో దేనితో శుభ్రం చేసినా వీటి వడపోత సామర్థ్యం గణనీయంగా దెబ్బతింటుంది. అప్పుడు ధరించినా ఉపయోగం ఉండదు. ఎన్‌95 మాస్కులను శుభ్రం చేసే పద్ధతులు వేరే. అవి అందరూ చేసేవి కావు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే- ఎన్‌95 మాస్కులు అందరికీ ఉద్దేశించినవి కావవి. డాక్టర్లు, నర్సులు, అంబులెన్స్‌ డ్రైవర్లు, వైద్య సిబ్బంది వంటి వారికి మాత్రమే. అలాగే కరోనా బారినపడి ఇంట్లో విడిగా ఉంటున్నవారు, వారికి సపర్యలు చేసేవారు వీటిని వాడుకోవాల్సి ఉంటుంది. మిగతా వారంతా మూడు పొరలతో కూడిన సర్జికల్‌ మాస్కులు సరిగ్గా ధరిస్తే చాలు. సాధారణంగా ఎన్‌95 మాస్కులను ప్రతి 8 గంటలకు మార్చాల్సి ఉంటుంది.

ప్రస్తుతం కరోనా ఎక్కువ విజృంభిస్తుండటం, ఎన్‌95 మాస్కుల వాడకం పెరిగిన నేపథ్యంలో వైద్యులకు, ఆరోగ్య సిబ్బందికి ఇప్పుడు 20 రోజులకు 5 మాస్కులను మాత్రమే వాడుకోవటానికి ఇస్తున్నారు. వీటిల్లో ఒకటి అత్యవసర వాడకానికి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. తొలిరోజున ఒక మాస్కును వాడిన తర్వాత దాన్ని అదే కవర్‌లో భద్రపరచుకోవాలి. మర్నాడు రెండో మాస్కును వాడుకొని దాన్ని అదే కవర్‌లో దాచుకోవాలి. ఇలా నాలుగు మాస్కులను నాలుగు రోజుల పాటు వాడుకోవాలి. ఐదో రోజున తొలిరోజున వాడిన మాస్కును ధరించాలి. ఆ మాస్కు మీద వైరస్‌తో కూడుకున్న తుంపర్లేవైనా అంటుకొని ఉంటే అప్పటికవి ఎండిపోతాయి. ఒకవేళ ఏదైనా మాస్కు చిరిగినా, దెబ్బతిన్నా పక్కన పెట్టుకున్న మాస్కును వాడుకోవాల్సి ఉంటుంది.

షీల్డ్‌ ధరించటం మంచిది

మాస్కుతో పాటు ముఖానికి షీల్డ్‌ ధరించటం మంచిది. దీంతో మాస్కు త్వరగా చెడిపోకుండా చూసుకోవచ్చు. గుడ్డ మాస్కులను ఉతికి వాడుకోవచ్చు గానీ ఎన్‌95 మాస్కులను ఉతకటం సరికాదు. అసలే మాస్కు లేకపోవటం కన్నా ఏదో ఒకటి మంచిదన్న ఉద్దేశంతోనే గుడ్డ మాస్కులు వాడుకోవాలని సూచిస్తున్నారు. సర్జికల్‌ మాస్కులు అందుబాటులో లేనప్పుడు వీటిని వాడుకోవటంలో తప్పులేదు. అయితే అందుబాటులో ఉంటే సర్జికల్‌ మాస్కులు వాడుకోవటమే ఉత్తమం. శాస్త్రీయంగా ఇవే సురక్షితం. ఒక సర్జికల్‌ మాస్కును ఒకరోజుకే వాడుకోవాలి. మర్నాడు కొత్తది వాడుకోవాలి. వీటిని కూడా ఉతికి, వాడుకోవటం సరికాదు.

ఇదీ చదవండి: 'కవాటం ఉన్న ఎన్‌-95 మాస్కులు వాడొద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.