ETV Bharat / sukhibhava

Camphor uses : కర్పూరం ప్రయోజనాలేంటో తెలుసా? - కర్పూరం ఆరోగ్యం

పూజ క్రతువులో వాడే కర్పూరం(Camphor uses).. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మీకు తెలుసా? మనకు ఉపశమనం కలిగించే వివిధ రకాల ప్రయోజనాలెన్నో కర్పూరంలో అంతర్లీనంగా దాగి ఉన్నాయి. అవేంటో తెలుసుకుందామా?

Benefits of Camphor
కర్పూరం ఉపయోగాలు
author img

By

Published : Oct 5, 2021, 5:30 PM IST

కర్పూరం.. దేవుడికి హారతి ఇచ్చేందుకు వాడే ఓ పదార్థం. పూజ సామగ్రిలో ప్రతిఇంట (Benefits of Camphor) తప్పనిసరిగా ఉండేది. పూజ క్రతువులో వాడే కర్పూరం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని (Camphor uses) మీకు తెలుసా..? మనకు ఉపశమనం కలిగించే వివిధ రకాల ప్రయోజనాలెన్నో కర్పూరంలో అంతర్లీనంగా దాగి ఉన్నాయి. విక్స్‌, ఆవిరి, దగ్గు సిరప్‌లు, బిళ్లల తయారీలోనూ (Camphor smell) కర్పూరం వాడుతారట. ఇవి కాసేపు పక్కన పెడితే ఇంట్లోని ఆ కర్పూరం ప్రయోజనాలెంటో చదివేయండి..

కర్పూరం ప్రయోజనాలివే..

  • సాధారణ జలుబుకు కర్పూరం దివ్వ ఔషధం. జలుబు సమయంలో కాస్త కర్పూరం ఆయిల్‌ను ఛాతీ, విపుపై రాయడం ద్వారా ఎంతో ఉపశమనం కలుగుతుందని పలువురు సూచిస్తున్నారు.
  • జుట్టు రాలడాన్ని కూడా కర్పూరం తగ్గిస్తుందట. సాధారణ హెయిర్ ఆయిల్‌లో కొన్ని చుక్కల కర్పూరం నూనెను కలిసి మర్దన చేస్తే తలలో రక్త ప్రసరణను పెరిగి, జుట్టు రాలడం గణనీయంగా తగ్గుతుందని చెబుతున్నారు.
  • అలాగే తలలో పేనుల నివారణకు కర్పూరం ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనెలో కాస్త కర్పూరం కలిపి జుట్టుకు పట్టించి.. ఆపై షాంపూతో శుభ్రం చేసుకుంటే పేనుల సమస్య తగ్గుతుంది.
  • ఇక శరీరంలోని ఏ చోటైనా మంటగా లేదా వాపుగా అనిపిస్తే కర్పూరం మ్యాజిక్‌లా పనిచేస్తుంది. రాషస్‌ (దద్దుర్లు) వచ్చినప్పుడు కర్పూరం నూనెను నీటితో కలిపి వాడటం ద్వారా కాస్త ఉపశమనం కలుగుతుంది. తామర, దురదలకూ కర్పూరం గొప్ప నివారిణిగా పనిచేస్తుంది.
  • గోరు చుట్టును కర్పూరం కొంత మేర తగ్గిస్తుంది.
  • మరి ముఖ్యంగా రాత్రుళ్లు నిద్ర పట్టకపోవడం అనేది ప్రస్తుత రోజుల్లో చాలా మందిలో కనిపించే సమస్య. అయితే, పడుకునే ముందు కొన్ని కర్పూరం చుక్కలను బెడ్‌, తలదిండుపై వెదజల్లితే చక్కటి నిద్ర పడుతుందన్నది పలువురి సూచన.

ఇదీ చదవండి:పొట్ట తగ్గడానికి పాటించాల్సిన నియమాలు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.