ETV Bharat / sukhibhava

భోజనం చేసిన తర్వాత 100 అడుగులు నడిస్తే మంచిదా ? ఆయుర్వేదం ఏం చెబుతుంది!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 19, 2023, 3:32 PM IST

After Eating 100 Steps Benefits : మనలో చాలా మందికి తిన్న వెంటనే నడుం వాల్చే అలవాటు ఉంటుంది. కానీ, ఇలా చేయడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ప్రతి ఒక్కరు తిన్న తరవాత కొద్దిసేపు అయినా నడవాలని.. ఇలా చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

After Eating 100 Steps Benefits
After Eating 100 Steps Benefits

After Eating 100 Steps Benefits : తిన్న వెంటనే చాలా మంది చేసే పని నిద్రపోవడం లేదంటే కూర్చుని రిలాక్స్‌ అవ్వడం. ముఖ్యంగా రాత్రిపూట తిన్న తర్వాత వెంటనే బెడ్‌ మీద వాలిపోతూ ఉంటారు. ఈ అలవాటు అనేక అనారోగ్య సమస్యలను ఆహ్వానిస్తుందని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. తిన్న తర్వాత కొంతసేపు నడవాలని సూచిస్తున్నారు.

Benefits of Walking After Eating Food: నడక మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మనందరికీ తెలిసిందే. జిమ్‌లో బరువులెత్తడం, జాగింగ్ చేయడం, యోగాసనాలు వేయడం ఇష్టం లేని వారికి వాకింగ్ ఒక మంచి వ్యాయామం అవుతుంది. తిన్న తర్వాత 100 అడుగులు నడవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.

After Eating Walking Benefits :

జీర్ణక్రియ మెరుగుపడుతుంది : ఆహారం తిన్న తరవాత కొద్దిసేపు నడవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. నడవడం వల్ల పేగుల్లో ఆహారం వేగంగా కదలి సులభంగా జీర్ణమవుతుందని చెబుతున్నారు. అలాగే ఆహారంలోని పోషకాలు అన్ని శరీరానికి అందుతాయని తెలియజేస్తున్నారు. అంతే కాకుండా తిన్న తరవాత 100 అడుగులు నడవటం వల్ల క‌డుపు ఉబ్బ‌రం, అజీర్ణం, వాపు వంటి సమస్యలు రాకుండా ఉంటాయట.

ఈజీగా బరువు తగ్గాలా? తిన్న తర్వాత నీరు ఇలా తాగి చూడండి!

చక్కెర స్థాయిలు అదుపులో : తిన్న తర్వాత 100 అడుగులు నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. నడవడం వల్ల శరీరంలోని గ్లూకోజ్‌ ఖర్చవుతుంది. దీనివల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయని అంటున్నారు. అలాగే రక్తంలో ఇన్సులిన్‌ హార్మోన్ శాతం పెరుగుతుందని తెలియజేస్తున్నారు. కాబట్టి తిన్న తర్వాత నడవడం వల్ల మధుమేహంతో బాధపడేవారు లేదా మధుమేహం వచ్చే ప్రమాదం ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుందని అంటున్నారు.

కఫం లోపాలను తగ్గిస్తుంది : భోజనం తర్వాత 100 అడుగులు నడవడం వల్ల కఫం లోపాలు కూడా తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అలాగే బరువు పెరిగే అవకాశం తక్కువగా ఉంటుందట. తిన్న తర్వాత నడక వల్ల శరీరంలో కొవ్వు పెరగకుండా ఉంటుందని చెబుతున్నారు.

ఒత్తిడి తగ్గుతుంది : మనలో చాలా మంది తిన్న తర్వాత కొద్దిగా ఆయాసంగా ఉందని అంటుంటారు. ఇలాంటి వారు భోజనం చేసిన తరవాత 100 అడుగులు వేయడం వల్ల ఆయాసం, ఒత్తిడి తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. రాత్రి తిన్న తరవాత కొద్దిసేపు నడవడం వల్ల తొందరగా నిద్రపడతుందని అంటున్నారు.

తిన్న తర్వాత కూల్​డ్రింక్స్, సోడా తాగుతున్నారా? - అయితే మీరు ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే!

ఇలా నడిస్తే నష్టాలే! వాకింగ్​లో ఈ తప్పులు అస్సలు చేయొద్దు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.