ETV Bharat / sukhibawa

తైద అంబలట.. గ్లాసు లాగిస్తే ఎంతో మేలట! - LOCK DOWN EFFECT

కంటికి కన్పించని కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. మందులేని ఈ మహమ్మారిని ముందు జాగ్రత్తతోనే అరికట్టవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడం వల్ల కూడా ఈ వ్యాధిని ఎదుర్కోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇందుకు తైదలు(రాగులు) ఎంతగానో దోహద పడుతాయని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

DDS DISTRIBUTED PORRIDGE TO SANITATION EMPLOYEES
తైద అంబలి.. గ్లాసు లాగిస్తే ఎంతే మేలు...
author img

By

Published : May 4, 2020, 11:20 AM IST

లాక్‌డౌన్‌ కాలంలో నిత్యం పరిశుభ్రతకు కృషి చేస్తోన్న పారిశుద్ధ్య కార్మికులకు మెదక్​ జిల్లా జహీరాబాద్‌లోని డీడీఎస్‌ ఆధ్వర్యంలో రాగులతో తయారు చేసిన అంబలిని 20 రోజులుగా పంపిణీ చేస్తున్నారు. అంబలిలోని పోషకాలు ఇతరత్రా ప్రాముఖ్యతలను కేవీకే శాస్త్రవేత్త భార్గవి వివరించారు.

అంబలి ద్వారా కలిగే ప్రయోజనాలు...

చిరుధాన్యాలైన రాగుల ద్వారా వంటకాలు చేసుకుని తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు లభించడమే కాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కొద్దిపాటి తీపిని కలిగి ఉండే రాగుల్లో కార్బోహైడ్రేట్లు, చక్కెర నిల్వలు, పీచు పదార్థాలు ఉంటాయి. వీటిని రోజువారీ ఆహారంగా తీసుకోవటం వల్ల జీర్ణక్రియ మెరుగు పడటం, పెద్ద పేగుకు కావాల్సిన నీటి నిల్వలు అందుతాయి. తద్వారా మలబద్దకం దూరమవుతుంది.

మధుమేహం, రక్తపోటుతో బాధ పడేవారికి ఊరట కలిగించడమే కాకుండా మెగ్నీషియం తగిన మోతాదులో ఉండటం వల్ల మైగ్రేయిన్‌, తలనొప్పి, గుండెనొప్పి సంబంధిత వ్యాధులకు పరిష్కారం లభిస్తుంది. అంబలిలో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు లభించడం వల్ల క్యాన్సర్‌ కారకాలను తగ్గించడంతోపాటు క్యాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకల్లో దృఢత్వం పెరగడంతోపాటు అధిక బరువును తగ్గిస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.