ETV Bharat / state

'భూములను ఎల్​ఆర్​ఎస్​ ద్వారా రెగ్యులరైజ్​ చేసుకోవాలి' - యాదాద్రి భువనగిరి మోత్కూరు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్​

అనుతుల్లేని లే అవుట్లలో కొన్న భూములను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్​ఆర్​ఎస్ (భూ క్రమబద్ధీకరణ చట్టం)​ ద్వారా రెగ్యులరైజ్​ చేసుకోవాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్​ కుమార్​ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ సాధారణ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు.

MLA Gadari Kishore
MLA Gadari Kishore
author img

By

Published : Jun 15, 2020, 10:58 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పురపాలిక పరిధిలో అందరి చేత ఇంటి పన్నులు కట్టించే బాధ్యతను కౌన్సిలర్లే తీసుకోవాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్​ సూచించారు​. మోత్కూరు మున్సిపాలిటీ సాధారణ సమావేశంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్​ప్లాన్ కింద మంజూరైన రూ. 73 లక్షలతో ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. పురపాలిక పరిధిలో మిగిలిన ప్రాంతాల్లో సైతం సీసీ రోడ్లు వేయాలని... పట్టణ ప్రధాన రహదారి వెడల్పును చట్ట ప్రకారం చేయాలని పేర్కొన్నారు. పురపాలక పరిధిలో కనీసం రెండు డంపింగ్ యార్డుల ఏర్పాటు కోసం ప్రభుత్వ భూమి కేటాయించాలని అధికారులకు సూచించారు.

కరోనా మహమ్మారిపై చేసే సమరంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్న ప్రజలు సహకరించాలని కోరారు. గతంలో పురపాలిక అభివృద్ధికి మంత్రి కేటీఆర్ కేటాయించిన రూ. 20 కోట్లలో... రూ. 14 కోట్ల పనులకు అనుమతులు వచ్చాయని తెలిపారు. వాటిని ఉపయోగించుకొని పట్టణాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో సమావేశంలో చర్చించామని ఎమ్మెల్యే వెల్లడించారు. అనంతరం 14వ ఫైనాన్స్ కమిషన్​ 2019 - 20 నిధుల్లో రూ. 8 లక్షల అంచనాతో పురపాలిక పరిధిలో మురికి కాలువ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఇదీ చూడండి: కేసీఆర్ వడ్డీ వ్యాపారిలా వ్యవహరిస్తున్నారు: బండి సంజయ్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.