జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన యాదాద్రి భువనగిరి జిల్లా క్రీడాకారులకు ఆర్థిక సహాయం అందజేశారు రాష్ట్ర ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి. మోత్కూరు మండలం దత్తప్పగూడేనికి చెందిన బోడిగె రాజు, కొండాపురం సతీష్లకు ఖర్చులకు గాను రూ.30 వేలు అందజేశారు. ఈ నెల 11న రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్- 19 కబడ్డీ పోటీల్లో యాదాద్రి జిల్లా జట్టు తరఫున ఆడి అత్యుత్తమ క్రీడా ప్రతిభ కనబరిచారు. ఈ నెల 18 నుంచి 20 వరకు గోవాలో జరిగే జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో ఈ విద్యార్థులు ఆడనున్నారు.
రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు కావడంతో.. పోటీలకు వెళ్లేందుకు ఖర్చులకు గాను రామకృష్ణారెడ్డి తన సాయాన్ని అందజేశారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు తన ప్రోత్సాహం తప్పకుండా ఉంటుందని తెలిపారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మోత్కూరు సింగిల్ విండో ఛైర్మన్ కంచర్ల అశోక్ రెడ్డి, కోఆప్షన్ ఎంపీటీసీ సాజిద్ పాష తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఏ రాష్ట్రంలో లేనివిధంగా దివ్యాంగులకు సంక్షేమ పథకాలు: కేటీఆర్