ETV Bharat / state

'విద్యార్థుల నుంచే శాస్త్రవేత్తలు ఉద్భవిస్తారు' - భువనగిరి తాజా వార్త

విద్యార్థులలో ఉన్న శాస్త్రవేత్తలను వెలికి తీయడానికి ఉపాధ్యాయుల పాత్ర ఎంతగానో ఉంటుందని విద్యుత్​శాఖ మంత్రి జగదీశ్​రెడ్డి అన్నారు. విద్యార్థుల నుంచే శాస్త్రవేత్తలు ఉద్భవిస్తారని మంత్రి తెలిపారు. భువనగిరిలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి జవహర్​లాల్​ నెహ్రూ జాతీయ సైన్స్​ మ్యాథ్స్​ ఎన్విరాన్మెంట్​ ఎగ్జిబిషన్​ను ప్రారంభించారు.

science-exhibition-in-yadadribhuvanagiri
'విద్యార్థుల నుంచే శాస్త్రవేత్తలు ఉద్భవిస్తారు'
author img

By

Published : Dec 4, 2019, 8:09 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 47వ జిల్లాస్థాయి జవహర్ లాల్ నెహ్రూ జాతీయ సైన్స్, మ్యాథ్స్ ఎన్విరాన్మెంటల్ ఎగ్జిబిషన్​ను మదర్ థెరిసా పాఠశాలలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్​రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గదారి కిషోర్, గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, జిల్లా కలెక్టర్ అనిత రామచంద్రన్ , జెడ్పీ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైని, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలు ఆసక్తిగా తిలకించారు. విద్యార్థులలో ఉన్న శాస్త్రవేత్తలను వెలికి తీయటానికే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, విద్యార్థుల నుంచే శాస్త్రవేత్తలు ఉద్భవిస్తారని మంత్రి జగదీశ్​రెడ్డి అన్నారు. ఆలోచన వివిధ పరికరాలను సృష్టించగలిగిందన్నారు.
విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉందన్నారు. వారిలో ఉన్న సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహించే విధంగా కృషిచేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. గొప్ప ఆవిష్కరణలకు ప్రభుత్వం తరపున సాయం అందిస్తామన్నారు. ఈ విద్య వైజ్ఞానిక ప్రదర్శనకు జిల్లా నలుమూల నుంచి విద్యార్థులు ఉత్సాహంగా ప్రదర్శనలో పాల్గొన్నారు.

'విద్యార్థుల నుంచే శాస్త్రవేత్తలు ఉద్భవిస్తారు'

ఇదీ చూడండి: సోయి లేకుండానే దారుణాలు..!

TG_NLG_61_04_SCIENCEFARE_AB_TS10061 రిపోర్టర్ : సతీష్ శ్రీపాద సెంటర్ : భువనగిరి జిల్లా : యాదాద్రి భువనగిరి సెల్ : 8096621425 యాంకర్ : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 47 వ జిల్లాస్థాయి జవహర్ లాల్ నెహ్రూ జాతీయ సైన్స్ ,మ్యాథ్స్ ఎన్విరాన్మెంటల్ ఎగ్జిబిషన్ ను మదర్ థెరిసా పాఠశాలలో ఈరోజు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్ రెడ్డిప్రారంభించారు.కార్యక్రమంలో ఎమ్మెల్యే లు గదారి కిషోర్, గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, ఉపాధ్యా య ఎమ్మెల్సీ నర్సీ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనిత రామచంద్రన్ , జెడ్పి చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైని, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. మంత్రి జ్యోతి వెలిగించి సమావేశాన్ని ప్రారంభించారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనను ప్రారంభించారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలు ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమ ముఖ్య అతిధి మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ మీలో ఉన్న శాస్త్ర వేత్తలను వెలికి తీయటానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని , విద్యార్థుల నుండే శాస్త్రవేత్తలు ఉద్భవి స్థారని అన్నారు. ప్రశ్నను తమకు తామే వేసుకొని నూతన విషయాలను కనుక్కోంటారని అన్నారు. ఇక్కడికి మూడువందల ప్రదర్శనలు తీసుకువచారంటే విద్యార్థులల్లో ఆసక్తి ఎంత ఉందో అర్ధం అవుతుందన్నారు.ఆలోచన వివిధ పరికరాలను సృష్టించగలిగిందన్నారు. ఉన్నదాని అభివృద్ధి చేయడానికి శాస్త్ర సంకేతిక అంశాలు దోహదం చేస్తాయని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో విద్యార్థులు ను తీర్చి దిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉందన్నారు. వారిలో ఉన్న సృజనాత్మక త గుర్తించి ప్రోత్సహించే విదంగా కృషిచేయాలని అన్నారు. అలాంటి ఆవిష్కరణలకు ప్రభుత్వం తరపున సాయం అందుతుందన్నారు. ఈ కార్యక్రమం ఇంత చక్కగా ఏర్పాటు చేసిన అధికారుల కృషి ని అభినందించారు. జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు జిల్లా నలుమూల నుండి విద్యార్థులు హాజరైయ్యారు. స్కూల్ ప్రాంగణం మొత్తం పిల్లల తో కళకళ లాడింది. విద్యార్థులు ఉత్సహంగా ప్రదర్శనలో పాల్గొన్నారు. బైట్ : జగదీశ్ రెడ్డి (రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి )
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.