ETV Bharat / state

ఉపాయం అదిరింది.. రక్షణ కుదిరింది..! - తెలంగాణ వార్తలు

వ్యవసాయక్షేత్రంలో నివాసం ఉంటున్నారు ఓ విశ్రాంత రైల్వే ఉద్యోగి. ఆ ప్రదేశంలో ద్విచక్రవాహనాన్ని నిలిపి ఉంచితే కోతులు, ఎలుకలు గందరగోళం సృష్టిస్తున్నాయి. బండిని ఎలాగైనా వాటి నుంచి రక్షించుకోవాలని అనుకున్నారు ఆయన. తనదైన ఉపాయంతో చక్కని కవచాన్ని ఏర్పాటు చేశారు.

retired-employee-made-protective-shield-for-his-bike-at-begumpet-in-yadadri-bhuvanagiri-district
ఉపాయం అదిరింది.. రక్షణ కుదిరింది..!
author img

By

Published : Mar 17, 2021, 9:53 AM IST

ద్విచక్రవాహనాన్ని ఇంటి బయట పెడితే కోతులు, ఎలుకలు గందరగోళం సృష్టించగా... దీని నివారణకు ఓ రక్షణ కవచం ఏర్పాటు చేశారు విశ్రాంత రైల్వే ఉద్యోగి రాజేందర్. ఉద్యోగ విరమణ అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం బేగంపేట గ్రామ శివారులోని తన వ్యవసాయ క్షేత్రంలో ఆయన నివాసముంటున్నారు. ఆ ప్రాంతాల్లో వానరాలు, ఎలుకల బెడద తీవ్రంగా ఉండడం వల్ల ఆయన ద్విచక్రవాహనాన్ని కాపాడుకోవడానికి ఓ ఉపాయం ఆలోచించారు.

ద్విచక్ర వాహనాన్ని బయట నిలిపి ఉంచితే కోతులు బైక్‌పై గెంతులేస్తున్నాయి. రాత్రివేళల్లో ఎలుకలు చొరబడి తీగలను కొరికేస్తున్నాయి. వీటి బెడద నివారణకు ఇనుపరాడ్లతో పెట్టె తయారుచేసి చుట్టూ జాలి బిగించాను. తాళం వేసుకునేలా ఏర్పాటు చేసుకున్నాను. ఇనుప పెట్టెలో వాహనం ఇప్పుడు భద్రంగా ఉంటోంది.

-రాజేందర్, విశ్రాంత రైల్వే ఉద్యోగి

ఉపాయం అదిరింది.. రక్షణ కుదిరింది..!

ఇదీ చదవండి: ఏపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.