యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా పరీక్షలు చేయట్లేదని.. చేస్తే కేసుల సంఖ్య మరింత పెరగనుందని ఆయన పేర్కొన్నారు.
మూడున్నర కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో మూడు నుంచి నాలుగు లక్షల టెస్టులు చేస్తుండటం చాలా సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం,హైకోర్టు.. కొవిడ్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించినా... రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు.
కరోనా విపత్కర పరిస్థితుల్లో ఒకేసారి మూడు నెలల కరెంట్ బిల్లు ఇస్తే.. పేద ప్రజల పరిస్థితేంటని సర్కారును ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. రాష్ట్రంలో కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆయన కోరారు.