యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో కొవిడ్ ఐసోలేషన్ సెంటర్‌గా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను మారుస్తామని.. ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. కొవిడ్ బాధితుల కోసం... ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు ఉదయం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల భవనాన్ని పరిశీలించారు. ఐసోలేషన్ సెంటర్‌కు కావాల్సిన ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అలాగే ఐసోలేషన్ సెంటర్ నిర్వహణకు యాదాద్రిలోని రాష్ట్ర ఆర్యవైశ్యసంఘం ముందుకు వచ్చింది. అవకాశం ఇస్తే... తాము కూడా ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని.. ఎమ్మెల్యేకు హమీనిచ్చింది. కరోనా రోగుల అవసరాల నిమిత్తం కొత్తగా మరిన్ని ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.
- ఇదీ చూడండి: మరోసారి పరస్పర విమర్శలకు దిగిన ఈటల, గంగుల