సర్దార్ సర్వాయి పాపన్న 370వ జయంతి సందర్భంగా భువనగిరి ఖిల్లా వద్ద ఉన్న విగ్రహానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
గీత కార్మికులకు తెరాస ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించారు. ట్యాంక్‌బండ్‌పై సర్దార్ పాపన్న విగ్రహాన్ని పెడతామని ఇచ్చిన హామీ కేసీఆర్ ఇప్పటి వరకు నెరవేర్చలేదని మండిపడ్డారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో పాపన్న విగ్రహం విషయంపై సభలో భట్టి విక్రమార్కతో చర్చకు తీసుకువస్తామని చెప్పారు. వచ్చే పాపన్న జయంతిలోపు ఇబ్రహీంపట్నం చౌరస్తాలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు.
ఇదీ చూడండి: సామాజిక మరుగుదొడ్లు వాడే వారిలో 62శాతం మందికి కరోనా