కరోనా వైరస్‌ను నివారించే ప్రక్రియలో కీలక పాత్ర వహించిన పారిశుద్ధ్య సిబ్బంది ఎంతో కీలకమని యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్ డాక్టర్ లక్ష్మీ నర్సింహారెడ్డి అన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కార్యాలయంలో పని చేస్తున్న 55 మంది పారిశుద్ధ్య సిబ్బందికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యలయం అందజేసిన మైసూర్ శాండల్ సబ్బులను అందజేశారు. ఎంతో భయంకరమైన కరోనా వైరస్‌తో నిరంతరం పోరాడుతున్న పారిశుద్ధ్య సిబ్బంది శ్రమ వెలకట్టలేనివ పేర్కొన్నారు.