Panthangi toll plaza traffic : సంక్రాంతి పండుగ సమీపిస్తోంది. విద్యార్థులు, ఉద్యోగులకు సెలవులు కూడా వచ్చేశాయి. ఇంకేం జనం సొంతూళ్లకు తరలివెళ్తున్నారు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రయాణ ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి. సొంతూళ్లకు వెళ్లేందుకు నగరవాసులు బస్టాపుల వద్ద పెద్ద సంఖ్యలో బారులు తీరారు.
టీఎస్ఆర్టీసీ నడిపే బస్సులతో సహా, ప్రైవేటు ట్రావెల్స్ సంక్రాంతి స్పెషల్ బస్సులకు ప్రయాణికులు పోటెత్తారు. పలు ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించటంతో పండగకు సొంతూళ్లకు వెళ్లేందుకు జనం క్యూ కట్టారు. గురువారం నుంచి ఈ రద్దీ మరింత పెరగనుంది.
ఈ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ గేట్ వద్ద వాహనాల రద్దీ నెలకొంది. వాహనాలు పెద్ద మొత్తంలో వస్తున్నా కూడా... దాదాపు 97% ఫాస్టాగ్ కలిగిఉన్నాయి. ఫలితంగా నిమిషాల వ్యవధిలోనే టోల్‌గేట్ దాటుతున్నాయి.
గతంతో పోల్చితే టోల్‌గేట్ వద్ద గంటల తరబడి వేచి ఉండే సమస్య లేదు. ఫాస్టాగ్‌లో నగదు చెల్లింపుతో టోల్‌ప్లాజాల వద్ద సాఫీగా రాకపోకలు సాగుతున్నాయి. సాధారణ రోజుల్లో కంటే భారీగా వాహనాల రాకపోకలు పెరిగాయి.
ఇదీ చదవండి: Rush in Railway Stations: సంక్రాంతి కోలాహలం... రద్దీగా మారిన రైల్వేస్టేషన్లు