ETV Bharat / state

వీడని మంచుతెరలు..

రాష్ట్రంలో ఉదయం చాలా వరకు మంచు తెరలు వీడడం లేదు. ఒక వైపు చూడటానికి ఆహ్లాదంగా ఉన్నా.. దారి కనిపించకపోవడం ఇబ్బంది కల్గిస్తుంది.

author img

By

Published : Feb 1, 2019, 9:52 AM IST

bhuvanagiri

heavy fog in yadadri
రాష్ట్రంలో చలి తీవ్రత ఇంకా తగ్గలేదు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో ఉదయం 9 గంటలైనా మంచు వీడలేదు. వెలుతురు రాకపోవడం వల్ల విధులకు హాజరయ్యే ఉద్యోగులు, విద్యార్థులు, ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉత్తర, ఈశాన్య దిశల గాలుల్లో తేమ శాతం పెరగడం వల్ల పొగమంచు ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మరికొన్ని రోజులు పొడి వాతావరణం ఉంటుందని అధికారులు తెలిపారు.
undefined

heavy fog in yadadri
రాష్ట్రంలో చలి తీవ్రత ఇంకా తగ్గలేదు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో ఉదయం 9 గంటలైనా మంచు వీడలేదు. వెలుతురు రాకపోవడం వల్ల విధులకు హాజరయ్యే ఉద్యోగులు, విద్యార్థులు, ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉత్తర, ఈశాన్య దిశల గాలుల్లో తేమ శాతం పెరగడం వల్ల పొగమంచు ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మరికొన్ని రోజులు పొడి వాతావరణం ఉంటుందని అధికారులు తెలిపారు.
undefined
Intro:TG_Mbnr_03_31_Sister_sindooja_PKG_C4

( ) ఎవరైనా ఉద్యోగం చేసేది జీవితం కోసం... కానీ ఆమె మాత్రం ఆర్థిక సమస్యలు ఉన్నా , డబ్బు అవసరం ఉన్నా.. జీతం గురించి ఆలోచించకుండా పేదలకు సేవ చేయాలనుకుంది. కోర్సు పూర్తయిన వెంటనే ప్రభుత్వ ఆస్పత్రిలో చేరీ.. గత ఆరు నెలలుగా రోగులకు ఉచితంగా తన సేవలు అందిస్తుంది.


Body:సింధూజ... ఈమెది స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం. తనకి చిన్నప్పటి నుంచి నర్సు కావాలని కోరిక. అనుకున్నట్టుగానే హైదరాబాదులోని నర్సింగ్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసింది. శిక్షణ పూర్తయ్యాక తన పంథాను మార్చుకుంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో పని చేస్తే మంచి జీతం వస్తుందని తెలిసినా.. వద్దనుకుంది. వచ్చిన అవకాశాన్ని వదిలేసుకుంది. పేద ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పని చేయడానికి సిద్ధమైంది. అప్పటికి అక్కడ నియామక ప్రకటన లేకపోయినా... ఉచితంగా సేవ చేసేందుకు అవకాశం కల్పించాలని అధికారులను కోరింది. దాంతో అక్కడ అవకాశం రావడంతో ఉచితంగా పేద రోగులకు సేవ చేస్తూ వేళకు పనికి హాజరవుతోంది. ప్రస్తుతం అక్కడ ఒప్పంద పద్ధతిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులకు 17 వేల చొప్పున జీతం అందుతుండగా... సిస్టర్ సింధూజ మాత్రం ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదు. అలా ఆరు నెలలుగా ఏ మాత్రం లాభం ఆశించకుండా పనిచేస్తుందామే. ఆమె పనితీరు, నిబద్ధతకు గణతంత్ర దినోత్సవం నాడు కలెక్టర్ రోనాల్డ్ రోస్ చేతులమీదుగా ప్రశంసా పత్రం అందుకుంది.


Conclusion:నేను తీసుకున్న శిక్షణకు మంచి ఉద్యోగమే వస్తుంది కానీ... పేదలకు సేవ చేయాలనే ఆలోచనతో జీతం తీసుకోవడం లేదని అంటుంది సిస్టర్ సింధూజ. కొన్నాళ్లపాటు ఇలాగే పేద రోగులకు సేవ చేయాలని నిర్ణయించుకున్నానని, అవకాశం రావడంతో సంతోషంగా సేవలందిస్తున్నట్లు వివరించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నియామక ప్రకటనలు వస్తేగానీ ఉద్యోగంలో చేరినని.. ఇలా ఉచితంగా సేవలు అందించడంలో తన సంతోషం ఉందని అభిప్రాయపడుతుంది.
బైట్
సింధూజ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.